Social News XYZ     

Subrahmanyapuram movie Producer “Beeram Sudhakar Reddy” interview

‘సుబ్రహ్మణ్యపురం’’ కుటుంబసమేతంగా చూడగలిగే మంచి సినిమా - నిర్మాత బీరమ్ సుధాకర రెడ్డి

సుమంత్‌, ఈషా రెబ్బా హీరో హీరోయిన్‌గా న‌టించిన చిత్రం `సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం`. సంతోష్ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌కుడు. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత బీరం సుధాక‌ర రెడ్డి మాట్లాడుతూ

మా ఇంటి కుల దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మా పూర్వికులు కర్నూల్‌ జిల్లా నంద్యాల దగ్గర సుబ్రహ్మణ్యేశ్వరపుతూర్‌ అనే గ్రామంలో సుబ్రమణేశ్వరస్వామి ఆలయం కట్టించారు. అప్పట్లో వారే ఆ ఆలయ ధర్మకర్తలుగా ఉండేవారు. ఈ సినిమా కూడా సుబ్రమణేశ్వర స్వామి పేరుతో ఉండడం, ఈ చిత్ర దర్శకుడు సంతోష్‌ ఈ సినిమా స్టోరీని వేరే ప్రొడ్యూసర్‌ కి చెప్పడం నేను విన్నాను. ఈ కథ నాకు బాగా నచ్చడంతో ఈ సినిమాను నేనే ప్రొడ్యూస్‌ చెయ్యాలని నిర్ణయించుకున్నాను.

 

మా సినిమా 'కార్తికేయ' సినిమాకు పూర్తి బిన్నంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తప్ప ఈ సినిమాలో కామన్‌ పాయింట్‌ ఉండదు. కొత్త డైరెక్టర్‌ అయినా ఈ సినిమాను చాలా బాగా హ్యాండిల్‌ చేశాడు.

ఈ సినిమా 'మానవ మేధస్సు గొప్పదా -దైవశక్తి గొప్పదా' అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా చూసిన తరువాత దైవాన్ని నమ్మని వాళ్ళు కూడా దైవం ఉంది అని నమ్మేవిధంగా ఈ సినిమాను దర్శకుడు సంతోష్‌ తెరకెక్కించడం జరిగింది. సినిమా మంచి డివోషనల్‌ థ్రిల్లర్‌ను సైంటిఫిక్‌ వేలో చూపించడం జరిగింది. పూర్వకాలం,సెకండ్‌ వరల్డ్‌ వార్‌ టైం నుండి దైవం యొక్క గొప్పతనం ఈ సినిమాలో చూపించడం జరిగింది. వాటితో పాటు ఆడియన్స్‌ కోరుకునే అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఈసినిమాలో ఉంటాయి. ఎలక్షన్ రోజు పోలింగ్‌ తరువాత వరుసగా మూడు రోజులు హాలిడేస్‌ ఉన్నాయి. అదే విధంగా కార్తీక మాసం చివరి రోజు కావడంతో మా సినిమా కూడా కుటుంబసమేతంగా చూడగలిగిన సినిమా అని ఆ రోజునే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. ఈ స్టోరీకి సుమంత్‌ గారైతే యాప్ట్‌గా ఉంటుంది అని డైరెక్టర్‌ గారు ముందే చెప్పడం జరిగింది. తరువాత నాకు కూడా సుమంత్‌ అయితే బాగుంటుంది అని ఆయనను సంప్రదించడం జరిగింది.

ఈ సినిమాలో గ్రాఫిక్స్‌ చేసింది బాహుబలి లాంటి గొప్ప చిత్రాలకు పనిచేసిన అన్నపూర్ణ వాళ్లు. ఈ సినిమాలో కూడా కథకు అనుగుణంగా గ్రాఫిక్స్‌కు మంచిప్రాధాన్యం ఉంటుంది. డైరెక్టర్ సంతోష్‌ ఈ సినిమా స్టోరీ నెరేట్‌ చేసే విదానం చాలా బాగా నచ్చింది. ఆ తరువాత అతను షార్ట్‌ ఫిలిమ్స్‌ చేసాడు అని తెలిసింది. సంతోష్‌ ఈ సినిమాను తనుచెప్పిన దానికంటే చాలా బాగా తీశాడు. సుమంత్‌ గారు 90 శాతం అని చెప్పారు కానీ నా వరకు సంతోష్‌ ఈ సినిమాను 100 శాతం అనుకున్న‌ట్లు తీశాడు. నాకూ, డైరెక్టర్‌కు మొదటి సినిమా కావడంతో సుమంత్‌ గారు కూడా ఈ సినిమాకు చాలా బాగా కోఆపరేట్‌ చేశారు. నేను నిర్మాతగా వారికి కావాల్సింది మాత్రమే ఏర్పాటు చేశాను. మిగతా ఆర్టిస్టులు కూడా అవుట్‌ డోర్‌ షూటింగ్‌ కోసం చాలా దూరం ప్రయాణం చేశారు. వారందరి కష్టానికి ఈ సినిమా ద్వారా మంచి ఫలితం లభిస్తుంది అని నమ్ముతున్నాను.

ఈ సినిమా తరువాత 2019 నుండి వరుసగా సినిమాలు చెయ్యాలని అనుకొంటున్నాను. కొన్ని స్టోరీస్‌ కూడా వింటున్న వాటిని ఫైనలైజ్‌ చేసి వివరాలు తెలియచేస్తాను.

Facebook Comments
Subrahmanyapuram movie Producer "Beeram Sudhakar Reddy" interview

About uma