సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన 'యం6' అందర్నీ అలరిస్తుంది
- నిర్మాత విశ్వనాథ్ తన్నీరు
విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ పతాకాలపై స్టార్ యాక్టింగ్ స్టూడియో సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం 'యమ్6'. జైరామ్ వర్మ దర్శకుడు. విశ్వనాథ్ తన్నీరు నిర్మాత. ధ్రువ, శ్రావణి, అశ్విని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 6 నిర్మాత విశ్వనాథ్ తన్నీరు పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - ''సినిమా మీద ఉన్న ప్యాషన్‌తోనే ఈ రంగానికి వచ్చాను. మొదట్లో కొన్ని టి.వి. సీరియల్స్‌లో నటించాను. కొన్ని సీరియల్స్ నిర్మించాను కూడా. అలాగే కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఇప్పుడు విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీని స్థాపించి నా తమ్ముడు ధ్రువను హీరోగా పరిచయం చేస్తూ 'యం6' చిత్రాన్ని నిర్మించాను. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఎంతో క్వాలిటీగా ఈ సినిమాను నిర్మించాం. ఇకపై మా బేనర్‌లో సంవత్సరానికి ఒక సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నాను. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మంచి సినిమాలు చెయ్యాలన్నదే నా కోరిక. అలాగే మా సినిమాల ద్వారా టాలెంట్ ఉన్న నటీనటులకు, టెక్నీషియన్స్‌కి అవకాశం కల్పిస్తాం. త్వరలోనే నా డైరెక్షన్‌లో సినిమా ప్లాన్ చేస్తున్నాను. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాను. 'యం6' సినిమా విషయానికి వస్తే దర్శకుడు జైరాం వర్మ చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమాను ప్రారంభించాం. ఇందులో సస్పెన్స్‌తో పాటు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కామెడీ, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ హైలైట్స్‌గా నిలుస్తాయి. ఈ సినిమాలో అంతర్గతంగా ఓ సందేశం కూడా ఉంది. ఈ చిత్రంలోని 'ఈ క్షణం..' అనే మెలోడియస్ పాటను అరకు, మంగళూరులో చిత్రీకరించాం. ఇటీవల విడుదలైన ఈ పాటకు యూ ట్యూబ్‌లో చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా విషయానికి వస్తే ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కడా బోర్ లేకుండా ప్రేక్షకులు కథతో పాటే ట్రావెల్ అవుతారు. ఈ సినిమాకి 'యం6' అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది. దర్శకుడు జైరామ్ వర్మ ఈ సబ్జెక్ట్‌ను డీల్ చేసిన విధానం చాలా బాగుంది. హీరో, హీరోయిన్ కొత్తవారైనా వారి నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్స్‌కి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. కంటెంట్ బాగుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. అలాంటి బలమైన కథ ఈ సినిమాలో ఉంది. మా 'యం6' చిత్రం ప్రేక్షకుల్ని హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్‌టైన్ చేస్తుందన్న నమ్మకం నాకు ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
ధ్రువ, శ్రావణి, అశ్విని, తిలక్, సాధన, అప్పలరాజు, గోవింద, హరిత, వంశీ, ఇంద్రతేజ నటించిన ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, ఎడిటింగ్: వంశీ కందాల, సినిమాటోగ్రఫీ: మహ్మద్ రియాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్, సమర్పణ: స్టార్ యాక్టింగ్ స్టూడియో, నిర్మాత: విశ్వనాధ్ తన్నీరు, దర్శకత్వం: జైరామ్ వర్మ
This website uses cookies.