డిసెంబర్ 7న ‘శుభలేఖ+లు’
ఇటీవల కాలంలో ఓ ప్రత్యేకమైన అటెన్షన్ రప్పించుకున్న చిత్రం ‘శుభలేఖ+లు’. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్‌లోనూ, ఇటు మార్కెట్‌లోనూ ఓ క్యూరియాసిటీ సొంతం చేసుకున్నదీ చిత్రం. పుష్యమి ఫిల్మ్ మేకర్స్ అధినేత బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని చూసి ఫ్యాన్సీ ఆఫర్స్‌ను వరల్డ్ వైడ్ రైట్స్ దక్కించుకుని గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హనుమ తెలుగు మూవీస్ పతాకం పై రూపుదిద్దకున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో
మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ...ఈ చిత్రం డిసెంబర్ 7న మీ ఆశీర్వాదంతో మీ అందరి ముందుకు వస్తున్నాం. డైరెక్టర్ శరత్‌గారు ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఒక మంచి కంటెంట్‌తో మేమందరం మీ ముందుకు వస్తున్నాం. మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాం అని అన్నారు. అందరూ ఓట్లు వేసి తర్వాత వచ్చి మా చిత్రాన్ని అందరూ చూడాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... 25 కొత్త ఆర్టిస్ట్‌లతో ఈ చిత్రాన్ని తీశాము. ప్రొడ్యూసర్ విద్యాసాగర్, జనార్ధన్ కలిసి నిర్మించిన చిత్రమిది. గోదావరి, ఆనంద్ లాంటి చిత్రాలు చేసిన కె.ఎల్.రాధాకృష్ణగారు మ్యూజిక్ అందించారు. మ్యూజిక్ వల్లే ఈ చిత్రం ఒక రేంజ్ కి వెళ్ళింది. టెక్నీషియన్స్ అందరూ చాలా ఇష్టపడి చేశారు. ప్రసెంట్ ఫ్యామిలీస్ కి, యూత్‌కి మధ్య ఉండే గ్యాప్‌ని తీసుకుని చేసిన చిత్రమిది. మేమందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం అందరికీ మా కృతజ్ఞతలు అన్నారు.
హీరోయిన్ ప్రియా వడ్లమాని మాట్లాడుతూ... మేము లాస్ట్ 10డేస్ నుంచి రాయలసీమ అవన్నీ ప్రమోషన్ భాగంలో వెళ్ళాం. చిన్న సినిమాల గురించి సిటీలో అంటే అందరికీ తెలుస్తుంది. కానీ ఊళ్లలో తెలియడం చాలా కష్టం. కాని మేము అక్కడికి వెళ్లాక మా ట్రైలర్, మరియు సాంగ్స్‌కి చాల మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ డిసెంబర్7న తప్పకుండా మా చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
హీరో శ్రీనివాస్ సాయి మాట్లాడుతూ... మేమందరం ఈ చిత్రం ద్వారా కొత్త పరిచయం అవుతున్నాం. ఈ డిసెంబర్7న మీ ముందుకు రాబోతున్నాం. మా ప్రయత్నం మేము చేసుకుంటు వెళుతున్నాం. ముఖ్యంగా మిగతా చిత్రాలకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే శరత్ గారు చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఆయన తలుచుకుంటే పెద్ద యాక్టర్స్‌ని పెట్టి తియ్యగలరు. కాని ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేసి తీశారు. ప్రమోషన్ కూడా ఎక్కడా పెద్ద సినిమాలకు తక్కువ కాకుండా తీశారు. మీరందరూ ఫ్యామిలీస్‌తో వెళ్లి చూడదగ్గ మంచి చిత్రమిది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. మేమందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం అని అన్నారు.
హీరోయిన్ దీక్షా మాట్లాడుతూ... ఈ చిత్రం మాకు చాలా ప్రత్యేకమైంది. మేము చాలా కష్టపడి చేసిన చిత్రమిది. ఎంతో అద్భుతమైన చిత్రం అందరూ తప్పకుండా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
నటీనటులుః శ్రీనివాస్‌సాయి, ప్రియవడ్లమాని, దీక్షశర్మరైనా, ఇర్ఫాన్, సింధు, తిరువీర్, వంశీరాజ్, మోనాబేద్రె, అప్పాజిఅంబరీష తదితరులు నటిస్తున్న
ఈ చిత్రానికి నిర్మాతలుః విద్యాసాగర్, జనార్ధన్ ఆర్.ఆర్, కథ-మాటలుః జనార్ధన్ ఆర్.ఆర్-విస్సు, కథాసహకారంఃసి.విద్యాసాగర్, స్క్రీన్‌ప్లే-డైరెక్షన్ఃశరత్‌నర్వాడే, సంగీతంఃకె.యం.రాధాక్రిష్టన్, డైరెక్షన్ ఆఫ్ ఫొటోగ్రఫీఃయస్.మురళీమోహన్‌రెడ్డి, ఆర్ట్‌డైరెక్టర్ఃబ్రహ్మకడలి, ఎడిటర్ఃమధు, కొరియోగ్రఫీఃచంద్రకిరణ్, పి.ఆర్.ఓఃపులగం చిన్నారాయణ, వీరబాబు బాసిశెట్టి, పబ్లిసిటి డిజైనర్ఃసుధీర్, స్టిల్స్ఃరఘు, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ఃసూర్యనారాయణకరుటూరి, కో-డైరెక్టర్ఃఎం.సర్వేశ్వరరావు, ప్రొడక్షన్‌కంట్రోలర్ఃప్రవీణ్‌పాలకుర్తి.