హీరో నాని నవలా రచయిత అయ్యాడు !
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటించబోతున్న సినిమా ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మైత్రి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. తాజా సమాచారం మేరకు ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో నానితో పాటు 5గురు మహిళలు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం.
నాని ఈ సినిమాలో ఒక నవలా రచయిత పాత్రలో కనిపించబోతున్నాడు. కొత్త తరహా పాత్రలను ఎంచుకోవడంలో నాని ఎప్పుడూ ముందు వరసలో ఉంటాడు. విక్రమ్ కుమార్ చెప్పిన పాయింట్ నానికి నచ్చడంతో ఈ సినిమా వెంటనే స్టార్ట్ కాబోతోంది. ఈ మూవీలో నటించే ఇతర నటీనటుల సాంకేతిక నిపుణల వివరాలు తెలియాల్సి ఉంది.
నాని ప్రస్తుతం గౌతమ్ దర్శకత్వంలో జర్సీ సినిమాలో నటిస్తున్నాడు. శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్రికెటర్ పాత్రలో నాని నటిస్తోన్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం మెయిన్హైలెట్ కానుందని సమాచారం.