Social News XYZ     

Nani24 To Be Directed By Vikram K Kumar And Produced By Mythri

నాని హీరోగా విక్ర‌మ్ కె కుమార్ దర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీస్ చిత్రం!

నేచుర‌ల్ స్టార్ నాని 24వ సినిమాను ప్ర‌క‌టించేశారు. `13బి`, `ఇష్క్`, `మ‌నం`, `24`, `హ‌లో` చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి.. సెన్సిబుల్‌, స‌క్సెస్‌ఫుల్ డైర‌క్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న విక్ర‌మ్ కె కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. `శ్రీమంతుడు`, `జ‌న‌తా గ్యారేజ్‌`, `రంగ‌స్థలం`... వ‌రుస‌గా సెన్సేష‌న‌ల్ హిట్స్ తో హ్యాట్రిక్ అందుకున్న భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. న‌వీన్ యెర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి (సీవీఎం) ఈ సినిమాకు నిర్మాత‌లు. ఫిబ్ర‌వ‌రి 19న ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకానుంది.

నేచుర‌ల్ స్టార్ నాని, విక్ర‌మ్ కె కుమార్, మైత్రీ మూవీ మేక‌ర్స్ కాంబినేష‌న్ అన‌గానే ఇటు చిత్ర‌వ‌ర్గాల్లోనూ, అటు అభిమానుల్లోనూ భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా గురించి నాని ఆదివారం ట్విట్ట‌ర్‌లో ఆసక్తిక‌ర‌మైన పోస్ట్ చేశారు

 

నాని ట్విట్ట‌ర్ లో ``నేను, విక్రమ్ ఇంకా ఆ మిగతా ఐదుగురు. వచ్చే సంవత్సరం లో. గ‌ర్ల్స్!! దిస్ ఒన్స్ ఫ‌ర్ యు `` అని పోస్ట్ చేశారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ ``మ‌న నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా, స‌క్సెస్‌ఫుల్ డైర‌క్ట‌ర్ విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మా సంస్థ‌లో సినిమాను నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. విజువ‌ల్స్ తో వండ‌ర్లు చేసే పీసీ శ్రీరామ్‌గారు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టులను, సాంకేతిక నిపుణుల పేర్ల‌నును వెల్ల‌డిస్తాం. ఫిబ్ర‌వ‌రి 19 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తాం`` అని అన్నారు.

Facebook Comments
Nani24 To Be Directed By Vikram K Kumar And Produced By Mythri

About uma