ఆ ప్రచారం రోబో 2.0 కు ప్లస్ అయ్యింది !
రజినీకాంత్, అమీ జాక్షన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నవంబర్ 29న ప్రపంచవప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రోబో 2.0 సినిమాకు అభ్యంతరాలు తలెత్తాయి. ఈ సినిమాలో మొబైల్ గురించి, సెల్ టవర్స్ గురించి నెగిటివ్ గా చూపిస్తున్నారు అంటూ చిత్ర బృందంపై టెలికాం సంస్తలు మండి పడ్డాయి. ఈ విషయమై సీవోఏఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సినిమా కంటెంట్ టెల్కోల ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉందంటూ సెన్సార్ బోర్డ్ ఇటువంటి సినిమాకు సట్టిఫికేట్ఎలా ఇస్తుందని ఆరోపించింది. ట్రైలర్ చూస్తుంటే పర్యావరణాన్ని మొబైల్ టవర్స్ , రేడియేషన్స్ నాశనం చేస్తున్నాయని అర్థం అవుతోంది. ఈ విధంగా సినిమా తీయడం కరెక్ట్ కాదని సీవోఏఐ రోబో 2.0 బృందం పై న్యూడిల్లీలో కేసు పెట్టడం జరిగింది.
కానీ సీవోఏఐ ఆరోపణలను కోర్టు తిప్పికొట్టింది. సినిమాను నవంబర్ 29 న విడుదల చేసుకోవచ్చని తెలిపింది. దీంతో చిత్ర యూనిట్ తో పాటు రజినీకాంత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక లొకేషన్స్ లో విడుదల కానుంది. సీవోఏఐ ;ఫిర్యాదు చెయ్యడం ఒకరకంగా చిత్రానికి ప్లస్ అయ్యింది కానీ మైనస్ కాలేదని టాక్ వినిపిస్తోంది. సినిమాపై పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ స్పీడ్ గా స్ప్రెడ్ అవుతోంది.