రామ్ గోపాల్ వర్మ భయపడ్డాడు !
వర్మ నిర్మించిన భైరవగీత సినిమాను కొత్త దర్శకుడు సిద్ధార్థ్ దర్శకత్వం వహించాడు. రోబో 2.0 సినిమా నవంబర్ 29న విడుదల అవుతున్నా సరే భైరవగీత సినిమాను నవంబర్ 30న విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు తన సినిమాను వాయిదా వేసుకున్నాడు వర్మ. భైరవగీతను డిసెంబర్ 7కి వాయిదా వేసాడు వర్మ. రోబో సినిమా తరువాత వస్తే ఈ సినిమాను పట్టించుకొనే వాడే ఉండడు. అందరూ రోబోపైనే ఆసక్తి చూపిస్తారు కనుక తన సినిమాను వాయిదా వేసుకున్నాడు వర్మ.
నాకు భయం అంటే ఏంటో తెలియదు నాకు, అసలు భయం నా కంపౌండ్ లోకి కూడా కాలు పెట్టలేదు వంటి భారీ డైలాగ్స్ చెప్పే వర్మ రోబో సినిమాకు భయపడడం చూసి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. రోబో 2.0 చిన్న పిల్లల సినిమా, భైరవగీత పెద్దోళ్ల సినిమా కావున అందరూ ఈ సినిమా చూడ్డానికి వచ్చేయండి అని చెప్పిన వర్మ తన సినిమా వాయిదా వెయ్యడం ఏంటని జనాలు అనుకుంటున్నారు. భైరవగీత సినిమా టీజర్ చూస్తుంటే ఇది ఒక విలేజ్ లవ్ స్టోరీగా తెలుస్తోంది. కొత్త దర్శకుడు సినిమాను ఆసక్తికరమైన కథ, కథనాలతో నడిపినట్లు వార్తలు వస్తున్నాయి.
This website uses cookies.