‘సుబ్రమణ్యపురం’ ట్రైలర్ చూస్తుంటే సినిమా
చూడాలనిపిస్తుంది-హీరో అఖిల్ అక్కినేని
భగవంతుడి ఉనికి అనేది నమ్మకం అనే పునాదుల మీద ఉంటుంది. ఆ నమ్మకం లేని వ్యక్తి భగవంతుడిపై చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి. కాపాడవలసిన భగవంతుడి ఆగ్రహాం తట్టుకోవడం సాధ్యం అవుతుందా..? సుబ్రమణ్యపురం లో దాగున్న రహాస్యం ఏంటి..? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన చిత్రం ‘సుబ్రమణ్యపురం’. విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ‘సుబ్రమణ్యపురం’ ఇండస్ట్రీ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గా మారింది. ఇప్పటికే హిందీ శాటిలైట్, ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్ లు పూర్తి అయ్యాయి. బాహుబలి, గరుడ వేగ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన టీం ‘సుబ్రమణ్యపురం ’ కు వర్క్ చేసారు. బాలసుబ్రమణ్యం పాడిన థీమ్ సాంగ్ హైలెట్ గా నిలుస్తుంది. సెన్సిబుల్ హీరో సుమంత్, ఇషా రెబ్బ జంటగా నూతన దర్శకుడు సంతోష్ జాగర్లమూడి రూపొందించిన ‘‘సుబ్రమణ్యపురం’’ ట్రైలర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. అక్కినేని అఖిల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మాట్లాడుతూ:
అఖిల్ అక్కినేని మాట్లాడుతూ:
‘ఇలాంటి కథలు దొరకడం చాలా కష్టం. ఎప్పుడో కానీ ఇలాంటి కథలు సెట్ అవవు. నేను థ్రిలర్స్ చూడటానికి పెద్దగా ఇష్టపడను కానీ ‘సుబ్రమణ్యపురం’ ట్రైలర్ చూస్తుంటే సినిమా చూడాలనిపిస్తుంది.టీం ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. భయాన్ని కలిగించకుండా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయగలిగాడు దర్శకుడు. సుమంత్ అంటే నాకు ప్రత్యేక మైన అభిమానం. ఈ సినిమా తప్పకుండా బిగ్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను.
సుమంత్ మాట్లాడుతూ:
‘‘నా లాస్ట్ సినిమా లో నాపేరు కార్తిక్, ఈ సినిమాలో కూడా అదే పేరు లాస్ట్ సినిమాలాగే ఇది కూడా సక్సెస్ అవుతుందని సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నమ్ముతున్నాను. నాకు థ్రిలర్స్ పెద్దగా నచ్చవు కానీ సంతోష్ కథ చెబుతున్నప్పుడు అతని నారేషన్ కి బాగా ఇంప్రెస్ అయ్యాను. ఇతను చెప్పినది విజువల్ గా మార్చడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సినిమా అంతా చూసాను, చాలా కాన్పిడెంట్ గా ఉన్నాను.త్వరలో మీముందుకు రాబోతున్నాం, టీం అందరికీ నా అభినందనలు’’ అన్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ:
నిర్మాత నాకు మంచి స్నేహితుడు, పైనాన్షియర్ గా ఉన్న అతను నిర్మాత గా మారతానంటే నేను వద్దు అన్నాను. కానీ సుబ్రమణ్యపురం ట్రైలర్ చూసాక ఇది కార్తికేయను మించి విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. కంటెంట్ బాగుంది పెద్ద విజయం సాధిస్తుంది. 500 కి పైగా థియేటర్స్ లో విడుదలవుతుంది’’
అన్నారు.
హీరోయిన్ ఇషా రెబ్బ మాట్లాడుతూ:
‘‘నాకు థ్రిలర్స్ అంటే చాలా ఇష్టం, నాకు బాగా నచ్చిన కథ ఇది. దర్శకుడు సంతోష్ స్ర్కిప్ట్ చెప్పినప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యాను. కథ విషయంలో అతనికి చాలా క్లారిటీ ఉంది. సుమంత్ మంచి కో ఆర్టిస్ట్, ఈ షూటింగ్ పిరియడ్ లో మంచి ప్రెండ్స్ అయ్యాము.టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిర్మాత సుధాకర్ రెడ్డిగారు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మరిచిపోలేను, ఆయన మరిన్ని మంచి సినిమాను చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ:
‘‘ఫైనాన్షియర్ గా ఉన్న నేను కేవలం సంతోష్ చెప్పిన కథ నచ్చే నిర్మాతగా మారాను. ఫైనాన్షియర్ గా చాలా సినిమాలకు సపోర్ట్ చేసాను. ఆర్టిస్ట్ లు, టెక్నిషియన్స్ ఇచ్చిన సపోర్ట్ తో ఈ సినిమాను మూడు నెలలలో కంప్లీంట్ చేసాం. డిసెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం. ’’ అన్నారు.
దర్శకుడు సంతోష్ జాగర్లమూడి మాట్లాడుతూ:
‘‘ ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ నిర్మాత సుధాకర్ రెడ్డి గారే. దర్శకుడిగా ఫస్ట్ ప్రాజెక్ట్ రావడం ఎంత కష్టమో నాకు తెలుసు. పనిలో ఎలాంటి ఒత్తడి కలగకుండా నిర్మాత నా వెనుక నిలబడి ప్రాజెక్ట్ ని నడిపించారు. కానీ నిర్మాత ఇచ్చిన సపోర్ట్ తో ఈ ప్రాజెక్ట్ కేవలం మూడు నెలల్లో కంప్లీట్ చేసాం. కథ వినేముందు సుమంత్ గారు నాకు థ్రిలర్స్ పెద్దగా నచ్చవు అన్నారు, కానీ కథ నచ్చి వెంటనే ఒప్పుకున్నారు. కార్తికేయకు దీనికి ఎలాంటి పోలికలు లేవు, ఇది కంప్లీంట్ ఢిపరెంట్ స్టోరీ ఒక సుబ్రమణ్యశ్వేర స్వామి మాత్రమే కామన్. ఇది ఒక డివోషనల్ థ్రిల్లర్
‘ఎవరికైనా కష్టం వస్తే భగవంతుడికి చెప్పుకుంటాం.. కానీ భగవంతుడే కష్టానికి కారణం అయితే ఎవరికి చెప్పుకుంటాం’అనేదే బేసిక్ లైన్ . ఈ సినిమాలో సురేష్ గారు, సాయికుమార్ గారు ఢిపరెంట్ రోల్స్ ప్లే చేసారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకి మరో హీరో అనుకోవచ్చు. అలాంటి మ్యూజిక్ అందించాడు. సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను’’ అన్నారు.
Star Cast: Sumanth Kumar, Eesha Rebba
Main Cast: Suresh, Sai Kumar, Ali, Satya Sai Srinivas, Mirchi Madhavi,
Surya, Raghunath Reddy, Sarika Ramachandar Rao, Josh Ravi, Bhadram,
Giridhar, Amit Sharma, TNR
Crew:
DOP: RK Pratap
Editor: Kaarthika Srinivas
Music Director: Shekar Chandra
Costume Designer: Suma Tripurana
Choreographer: Bhanu
Fights: Dragon Prakash
PRO-GSK Media
Co-director: R.Suresh
Producer: Beeram Sudhakara Reddy
Writer & Directior: Santhossh Jagarlapudi
This website uses cookies.