రంగు సినిమా ను మేమే ప్రమోట్ చేస్తాం : లారా కుటుంబ సభ్యులు
తనీష్, ప్రియా సింగ్ జంటగా నటించిన " రంగు" సినిమా పై అభ్యతరాలు ఉన్నాయని మీడియా ముందుకు వచ్చిన లారా కుటుంబ సభ్యులకు చిత్ర యూనిట్ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. విజయవాడలో కొన్నాళ్ల క్రితం సంచలనం సృష్టించిన కేస్ 'లారా'. లారా కథ ను సినిమా రిలీజ్ కాబోతోంది అని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు ఈ సోమవారం (12.11.11) ఫిల్మ్ చాంబర్ లో ప్రెస్ మీట్ పెట్టి తమ అభ్యతరాలు చెప్పడం జరిగింది. వాటిపై స్పందించిన చిత్ర యూనిట్ వారికి సినిమా ను ప్రసాద్ లాబ్ లో ప్రత్యేక ప్రదర్శన చేసారు.
సినిమా చూసిన అనంతరం లారా కుటుంబ సభ్యులు, చిత్ర యూనిట్ మీడియా తో మాట్లాడుతూ:
దిలీప్ (లారా బావ మరిది) మాట్లాడుతూ: " . మీడియా ద్వారా మా అభ్యతరాలు చెప్పిన తర్వాత నిర్మాత, దర్శకులు మమ్మల్ని పిలిపించి మాట్లాడారు. సినిమా మీద నెగిటివ్ ఫీలింగ్ తోనే వచ్చాము. సినిమా చూసాక చాలా సంతోషంగా ఉంది. రెండు మూడు సన్నివేశాల్లో డైలాగ్ లు మ్యుట్ చేయమని కోరాం. దర్శకుడు చేస్తాం అని మాట ఇచ్చారు. మా లారా జీవితం కథ గా మలిచిన తీరు బాగుంది. తనీష్ నటన బాగుంది. విజయవాడలో ఈ సినిమా కు అండ గా నిలబడతాం. మేమే ప్రమోట్ చేస్తాం" అన్నారు.
హీరో తనీష్ మాట్లాడుతూ : "నేను చెప్పినట్లు రంగు రిలీజ్ అవుతుంది. పోస్టర్ పడుతుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చెమర్చిన కళ్ల తో బయటకు వస్తారు. వీరు సినిమా కు అండ గా నిలబడు తున్నందుకు చాలా ఆనందంగా ఉంది " అన్నారు.
దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ : " సినిమా ఒక ఎమోషనల్ జర్నీ గా ఉంటుంది. లారా కుటుంబ సభ్యులు ఈ సినిమా పై అభ్యతరాలు వ్యక్త పరిచాక వారికి సినిమా చూపించడం జరిగింది. వారు కోరినట్లు సినిమా లో రెండు మూడు సన్నివేశాల్లో సౌండ్ మ్యుట్ చేస్తాం. " అన్నారు.
నిర్మాత పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ : సినిమా ఈ నెల 23న రిలీజ్ అవుతుంది. సినిమా పై ఉన్న అభ్యతరాలు అన్నీ ఈ రోజు తొలిగి పోయాయి. సినిమా లారా కుటుంబ సభ్యులను మెప్పించడం మా మొదటి విజయం గా బావిస్తున్నాము" అన్నారు.
తనీశ్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, షఫీ, టార్జాన్, రఘు కారుమంచి, హరిబాబు, తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ‌్రీనివాస్ నాయుడు గలభా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.ఎస్.చక్రవర్తి, కో ప్రొడ్యూసర్: కటకం వాసు, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సాయికిరణ్, సంగీతం: యోగీశ్వర శర్మ, ఎడిటర్: పైడి బస్వ రెడ్డి, సినిమాటోగ్రాఫర్: టి.సురేందర్ రెడ్డి, డైలాగ్స్: పరుచూరి బ్రదర్స్ నిర్మాతలు: ఎ.పద్మనాభ రెడ్డి, నల్ల అయన్న నాయుడు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కార్తికేయ.