చరణ్ సినిమాకు రీ షూట్స్ !
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇంతవరుకు పూర్తి అవ్వలేదని సమాచారం. ఎడిటింగ్ రూమ్ లో బోయపాటి చూసిన కొన్ని సీన్స్ బాగా రాలేదని రీ షూట్ చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ రెండో వారానికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.
ఒకవైపు రాజమౌళి చరణ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నవంబర్ 29 నుండి ఆర్.ఆర్.ఆర్ మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడు. కానీ ఇప్పటివరుకు బోయపాటి సినిమా షూటింగ్ పూర్తి కాలేదు కావున, రాజమౌళి చరణ్ కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. బోయపాటి శ్రీను టేకింగ్ కొంచం నెమ్మదిగా ఉన్నా సీన్స్ బాగా తీస్తాడని పేరుంది. మరి చరణ్ కు మరో హిట్ ఇస్తాడేమో చూద్దాం.