అమర్ అక్బర్ ఆంథోనీ ఎందుకు ఫ్లాప్ అయ్యింది ?
అమర్ అక్బర్ ఆంథోనీ సినిమానుతో శ్రీనువైట్ల హిట్ కొట్టి మాస్ మహారాజకు ఒక సక్సెస్ ను ఇస్తాడు అనుకున్నారు అంతా.కానీ సీన్ రివర్స్ అయ్యింది. మొదటి ఆట నుండే సినిమాకు డివైడ్ టాక్ రావడంతో సినిమాకు మాట్నీ నుండే కలెక్షన్స్ లేవు. శ్రీనువైట్ల తన రొటీన్ టెంప్లెట్ నుంచి బయటికొచ్చి ఈ సినిమా చేశానని పలుమార్లు ప్రెస్ మీట్స్ లో చెప్పాడు, కానీ సినిమా అందుకు చాలా భిన్నంగా ఉంది. సినిమా ప్రారంభ సీను నుంచీ తల్లిదండ్రుల్ని చంపిన ఒక్క సీనునే రెండో సగం వరుకు ఫ్లాష్ బ్యాకులు వేసుకుంటూ పోయారు. జనాలకి ఇది అస్సలు అర్థం కానీ విషయం. .
హీరో పాత్ర తల్లిదండ్రుల మరణానికి ఫీలవడంగానీ, ప్రతీకారానికి రగిలిపోవడంగానీ కన్పించవు. పైగా ఈ పాత్రలకి పదేపదే కమెడియన్లతో కథతో సంబంధం లేని కామెడీ ట్రాకులు అడ్డు పడుతూంటాయి. హీరోయిన్ కూడా పెద్దగా అందంగా కనిపించలేదు. ఆంటీ లాగా తయారయ్యిందని విమర్శలు వస్తున్నాయి. ఆమె ఏం బాగుందని ఈ సినిమాకు సెలెక్ట్ చేసుకున్నారో ఎవ్వరికీ అర్థం కాదు. చివరికి మాస్ రాజా కెరీర్ కి మరో ఫ్లాప్ వచ్చి పడింది. ఇక తన నెక్స్ట్ సినిమా వి.ఐ.ఆనంద్ పైనే రవితేజ ఆశాలన్నీ.
This website uses cookies.