అన్ని వర్గాలను అలరించే సినిమా టాక్సీవాలా
విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'టాక్సీవాలా'. జి.ఎ 2 పిక్చర్స్, యు.వి.క్రియేషన్స్ బ్యానర్స్‌పై రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఎస్.కె.ఎన్ నిర్మిస్తోన్న చిత్రం 'టాక్సీవాలా'. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని నవంబర్ 17న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
దర్శకుడు రాహుల్ మాట్లాడుతూ... ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుంది. రేపు మీ ముందుకు రాబోతుంది. నిన్న మా చిత్ర యూనిట్ మొత్తం ఈ సినిమాని చూశాం చాలా బావుంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ అన్ని వర్గాలను అలరిస్తుంది. తప్పకుండా మీరందూ చూడండి. పైరసీ ప్రింట్ చూసిన వాళ్ళు కూడా మళ్ళీ సినిమాని చూడండి అని అన్నారు.
హీరోయిన్ మాళవిక నాయర్ మాట్లాడుతూ... మా డైరెక్టర్ రాహుల్ చెప్పినట్లు ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. నేను ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాను. అది మీరు థియేటర్స్‌కి వెళ్ళి చూస్తేనే బావుంటుంది. మీరందరూ తప్పకుండా రేపు సినిమాని చూడండి అని అన్నారు.
హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ మాట్లాడుతూ... ఈ చిత్రంలోని పాటలు ఎంత హిట్ అయ్యాయో సినిమా కూడా అదే విధంగా హిట్ అవుతుంది. మూవీ అంతా చాలా సరదాగా ఉంటుంది. మీరందరూ సినిమా మొదటి నుంచి చివరి వరకూ నవ్వుతూనే ఉంటారు. తప్పకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రమిది. మిమ్మల్ని అందర్నీ అలరిస్తోందని అన్నారు.
ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ... యువి.క్రియేషన్స్‌లో ఫస్ట్ విడుదలైన భలే భలే మగాడివోయి చిత్రం ఎంతగా హిట్ అయిందో, గీత ఆర్ట్స్ లోని గీత గోవిందం ఏ విధంగా విజయాన్ని సాధించిందో ఈ చిత్రం కూడా అంతే విజయాన్ని సాధిస్తుంది. ఇంత పెద్ద కాంబినేషన్‌లో హైఫై సూపర్ న్యాచరల్ థ్రిల్లర్ ఇది. మా డైరెక్టర్ రాహుల్ ఇప్పటివరకూ ఎవరూ తీసుకోని పాయింట్‌ని తీసుకుని తెరకెక్కించారు. సైన్స్ ఫిక్షన్ కామెడీని తీసుకుని చాలా బాగా తీశారు. రాహుల్ పాయింట్ చెప్పినవెంటనే నాకు, అరవింద్‌గారికి, బన్నీగారికి బాగా నచ్చి ఓకే చేశాము. ప్రస్తుతం అన్ని భాషల్లో కాన్సెప్ట్ చిత్రాలు వస్తున్నాయి. అదే విధంగా కాన్సెప్ట్ పరమైన మూవీ ఇది. విజయదేవరకొండ ఇప్పటివరకు చేసిన చిత్రాలన్నీ డిఫరెంట్ జోనర్స్‌లోఉంటాయి. ఇది కూడా ఒక కొత్త జోనర్ మీరందరూ వీకెండ్ వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రియాంక కూడా ఈ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం కాబోతుంది తనకు మీ టీమ్ అందరి తరపున ఆల్ ద బెస్ట్. అదే విధంగా మరో హీరోయిన్ మాళవిక నాయర్ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ హీరోయిన్ తనదికూడా ఈ చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్. జేక్స్ బేజాయ్ మంచి మ్యూజిక్ అందించారు. అన్ని పాటలు చాలా పాపులర్ అయ్యాయి. రేపు హైదరాబాద్‌లో 126 షోస్ పడుతున్నాయి. మొన్న పైరసీ చూసిన ప్రతి ఒకళ్ళు కూడా మళ్ళీ థియేటర్‌కి వెళ్ళి సినిమాని చూడండి. ఒక పూర్తి సినిమా చూసిన అనుభవం వస్తుంది. అందరూ ఫ్యామిలీతో వెళ్లి తప్పకుండా చూడండి. మీరు థియేటర్స్‌కి వెళ్ళి చూసిన డబ్బులు మాకు రావు. ఇందులో చాలా మంది ఉంటారు చాలా మందికష్టం ఉంటుంది. థియేటర్ వాళ్ళు, ఎంతోమంది టెక్నీషియన్ల కష్టం ఉంటుంది అందరికీ నా కృతజ్ఞతలు అన్నారు.