లీకులపై విజయ్ దేవరకొండ స్పందన !
తెలుగులో ఉన్న పెద్ద నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్-యూవి క్రియేషన్స్ ఒకటి. ఇప్పుడు ఈ సంస్థలు సంయుక్తంగా విజయ్ దేరకొండ హీరోగా టాక్సీవాలా సినిమాను తెరకెక్కించాయి. ఈ శనివారం చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి ఈ చిత్రం గీత గోవిందం కంటే ముందే విడుదలవ్వాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్ సంకృతియన్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు.
ఈ సినిమా విడుదలకు ముందే నెట్ లో రావడం అందరిని షాక్ కు గురి చేసింది. ఎడిటింగ్ టేబుల్ మీద ఉన్న సినిమా బయటికి వచ్చింది అంటే కచ్చితంగా చిత్ర యూనిట్ సభ్యుడు ఎవరో లీక్ చేసి ఉంటాడని విజయ్ దేవరకొండ అంటున్నాడు. గీతా గోవిందం సినిమా కూడా ఇలానే జరిగింది, విజయ్ దేవరకొండ ఎదుగుదలను తట్టుకోలేక ఎవరో ఇలా చేస్తున్నారని విజయ్ తెలిపాడు. లీకులు ఇంకెంత దూరం వెళుతాయో చూడాలి. టాక్సివాలా విడుదలై సక్సెస్ సాధిస్తే ఆ చిత్రానికి పని చేసిన వారికి మంచి అవకాశాలు వస్తాయి.