Social News XYZ     

Ranarangam movie completes dubbing work

డబ్బింగ్ పూర్తి చేసుకున్న ‘రణరంగం’

Ranarangam movie completes dubbing work

AR మూవీ ప్యారడైజ్ పతాకంపై కిషోర్ కుమార్, యగ్నాశెట్టి హీరోహీరోయిన్లుగా శరణ్. కె. అద్వైతన్ దర్శకత్వంలో ఏ. రామమూర్తి నిర్మించిన చిత్రం ‘రణరంగం’. తమిళ్‌లో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. మూడు దశాబ్ధాల కథతో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అందరికీ నచ్చుతుంది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఆయన మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన ఎస్సెట్. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము..’’ అని అన్నారు.

కిషోర్ కుమార్, యగ్నాశెట్టి, సులీలే కుమార్, మిధున్ కుమార్, రజినీ మహదేవయ్య, అజయ్ రత్నం, ధీరజ్ రత్నం తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఎడిటింగ్: సురేష్ యుఆర్‌ఎస్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఆర్. శీనురాజ్, కెమెరా: పుష్పరాజ్ సంతోష్, జెమిన్ జామ్ అయ్యనేత్, నిర్మాత: ఏ. రామమూర్తి, దర్శకత్వం: శరణ్. కె. అద్వైతన్.

Facebook Comments
Ranarangam movie completes dubbing work

About uma