Social News XYZ     

Happy that I worked with all these talented comedians: Srinu Vaitla

ఇంతమంది టాలెంటెడ్ కమెడియన్స్ తో పనిచేయడం ఆనందంగా ఉంది - అమర్ అక్బర్ ఆంటోనీ ప్రెస్ మీట్ లో దర్శకుడు శ్రీనువైట్ల..!!

Happy that I worked with all these talented comedians: Srinu Vaitlaరవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ' అమర్ అక్బర్ ఆంటోనీ'.. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 16 న(రేపు) రిలీజ్ అవుతుంది..ట్రైలర్, సాంగ్స్ తో ప్రేక్షకుల్లో మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం పై మంచి అంచనాలున్నాయి.. ఇలియానా కథానాయికగా నటించగా తమన్ సంగీతం అందించారు.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.. కాగా ఈ సినిమా పాత్రికేయుల సమావేశం హైదరాబాద్ లో జరిగింది.. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ శ్రీనువైట్ల తో పాటు చిత్రలో నటించిన హాస్య నటులు హాజరయ్యారు.. ఈ సంధర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల చిత్రంలోని హాస్య నటులను పరిచయం చేసారు.. చిత్రంలోని వారి పేర్లను వెల్లడిస్తూ వారి పాత్ర విశేషాలను వెల్లడించారు..

ఈ సంధర్భంగా కమెడియన్ వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నా పాత్ర పేరు చంటి మిరియాల.. శ్రీనువైట్ల గారు అయన ప్రతి సినిమా లో మంచి క్యారెక్టర్ ఇస్తారు.. ఈ సినిమాలో కూడా మంచి పాత్ర వేశాను.. ఫస్ట్ టైం నెగెటివ్ షేడ్ ఉన్న ఫన్నీ క్యారెక్టర్ చేస్తున్నాను.. నా తోటి హాస్య నటుల కాంబినేషన్ లో సీన్స్ చాల బాగున్నాయి.. మీ అందరికి అవి ఎంతగానో నచ్చుతాయనుకుంటున్నాను.. ఒక కమెడియన్ కి స్టార్టింగ్ ఎండింగ్ డిజైన్ చేసే రేర్ డైరెక్టర్స్ లో ఒకరు శ్రీనువైట్లగారు.. ప్రతి క్యారెక్టర్ ని చాల బాగా డిజైన్ చేసారు.. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు..

 

శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అయన ప్రతి సినిమాలో మమ్మల్ని పెట్టుకుని ఆదరించినందుకు దర్శకుడు శ్రీనువైట్ల గారికి చాల థాంక్స్.. సినిమాలో ని వాటా లో మేము చేసే అల్లరి మాములుగా ఉండదు.. ఎవ్రీ సీన్ చాల ఎంజాయ్ చేస్తూ చేసాం.. రఘుబాబు గారిని విపరీతంగా టీజ్ చేసే క్యారెక్టర్ నాది.. మంచి క్యారెక్టర్ చేశాను.. నాతో పాటు ఈ సినిమాలో చేసిన నటులకి అల్ ది బెస్ట్.. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మా కెరీర్ కి బాగా ఉపయోగపడాలి.. అన్నారు..

గిరిధర్ మాట్లాడుతూ.. శ్రీనువైట్ల గారి ప్రతి సినిమాలోలాగే ఈ సినిమాలోనూ మంచి పాత్ర చేశాను.. నా కెరీర్ ని మరొక లేయర్ లోకి తీసుకెళ్లే పాత్ర నాది.. ఈ సినిమాలో చేతన్ శర్మ పాత్ర ను చేశాను.. వెన్నెల కిషోర్ గారి అసిస్టెంట్ ని.. చాల ఎంటర్టైనింగ్ గా ఉండే పాత్ర నాది.. అందరి కాంబినేషన్ లో ఎంతో ఎంజాయ్ చేస్తూ సినిమా చేసాను.. ఇంత మంచి పాత్రను నాకిచ్చిన శ్రీనువైట్ల గారికి చాల థాంక్స్..

దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ.. ఈ గ్యాంగ్ కి సెకండ్ హాఫ్ లో సునీల్ జాయిన్ అవుతాడు.. అతని పేరు బేబీ సిట్టర్ బాబీ..ఈ పాత్ర ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది.. ఈ కామెడీ పాత్రలన్నీ కథలో భాగమే తప్ప సెపరేట్ ట్రాక్ లు ఉండవు.. మొదటినుంచి చివరి వరకు వీరు సినిమాలో ఉంటారు. చాల రోజుల తర్వాత నా సినిమాలో ఇంత బాగా కామెడీ సెట్ అవడం ఆనందంగా ఉంది.. ఇంత మంచి టాలెంటెడ్ కమెడియన్స్ తో పనిచేయడం హ్యాపీ గా ఉంది..

Facebook Comments
Happy that I worked with all these talented comedians: Srinu Vaitla

About uma