పూరి జగన్నాధ్ నెక్స్ట్ సినిమా ఖరారు !
పైసా వసూల్ ఫ్లాప్ అయినా కానీ బాలకృష్ణకి మాత్రం ఆ సినిమాలో తనని పూరి ప్రెజెంట్ చేసిన విధానం బాగా నచ్చింది. కావున బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ ను పూరి చేతిలో పెట్టినట్లు సమాచారం.కథ చర్చలు పూర్తి అయ్యాయని త్వరలో ఈ చిత్రానికి సంభందించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ డిసెంబర్ నాటికి పూర్తి అవుతోంది. ఆ తరువాత తనయుడు సినిమామీద ఫోకస్ పెట్టబోతున్నట్లు సమాచారం
పూరి జగన్నాధ్ గతంలో చిరంజీవి అబ్బాయి చరణ్ ను చిరుత సినిమాతో హీరోగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. పురి జగన్నాధ్ ఇటీవల తన అబ్బాయి ఆకాశ్ తో తీసిన సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు, అయినప్పటికి పురితో సినిమాలు చెయ్యడానికి చాలా మంది హీరోలు రెడీగా ఉంటారు. బాలకృష్ణకు మాస్ లో విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. మోక్షజ్ఞ సినిమాల్లోకి రాబోతున్నాడంటే అంచనాలు మరింత ఎక్కువ ఉంటాయి. మరి మోక్షజ్ఞను పురి ఎలా ప్రెజెంట్ చెయ్యబోతున్నాడో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ ఎవరనేది త్వరలో తెలియనుంది. పురి ఈ మూవీని సొంతంగా నిర్మించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.
This website uses cookies.