The crazy project of UV creations and Geetha Arts-2 “Taxiwala” pre-release event was conducted today. While speaking at the event, producer of the film SKN said that Allu Aravind and Southern Star Allu Arjun made me what he is today.
Vijay Devarakonda introduced writer, DOP and other people who worked hard for the film irrespective of their personal and health problems. He said "We put our blood and sweat while making this film and some immature people tried to ruin our work. But you, the Rowdies and all the movie lovers know the value of our efforts. Please do experience the magic of Taxiwala in the theater in 17th of November."
Chief guest and southern Star Allu Arjun graced the event. He thanked writers and lyricists who worked for the film. He appreciated heroine Priyanka Jawalkar for her efforts.
He also congratulated RRR team as they launched their movie today.
He requested VD a custom-made dress for him when they meet at next pre release event. Bunny said “Vijay is a fantastic performer. We had a very easy path to the but Vijay Devarakonda is a self-made star. I respect self-made made really enjoy VD's success.
విజయదేవర్‌కొండలో ఒరిజినాలిటీ ఉంది- "సదరన్ స్టార్" అల్లు అర్జున్
గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ పాపులారిటీ ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే. అలాంటి పాపులర్ హీరో ఇప్పుడు టాక్సీవాలా అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ2 పిక్చర్స్ మరియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా....రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్స్, సాంగ్స్, ప్రమోషనల్ వీడియోలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ అంచనాల్ని మరింత పెంచే విధంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేశారు. ఈ వేడుకకు "సదరన్ స్టార్" అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేయడం విశేషం. టాక్సీవాలా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని.... మంచి ప్రశంసలు అందుకుంది. యు బై ఏ సర్టిఫికెట్ తో టాక్సీవాలా నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జెఆర్‌సిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా జరుపుకున్న సందర్భంగా ....
దర్శకుడు పరశురాం మాట్లాడుతూ... ఇటీవలె విజయ్‌ది నాది గీతగోవిందం విడుదలయింది. ఆయన గురించి గతంలోనే స్టేజ్ మీద చెప్పాను సంస్కారవంతుడు అని. నా కెరియర్‌లో అప్ అండ్ డౌన్స్ ఉన్న టైంలో అరవింద్‌గారు, బన్నీగారు నన్ను గుర్తించి అవకాశం కల్పించినందుకు ఈ టాక్సీవాలాకి సంబంధించిన యూనిట్ మొత్తం నాకు కావల్సినవాళ్ళే.రాహుల్ నీ డెడికేషన్ నేను చూసేవాడ్ని నాకు మంచి జరిగింది నీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. టాక్సీవాలా పెద్ద హిట్ కావాలి కోరుకుంటున్నాను. అరవింద్‌గారు మాలాంటివాళ్ళకి ఇలా అవకాశాలు ఇవ్వాలి. విజయ్ హవా ఇలానే సాగాలి. హీరోయిన్ ప్రియాంక్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌కి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను అందరికీ నా కృతజ్ఞతలు అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్‌బేజాయ్ మాట్లాడుతూ... ముందుగా నన్ను ఆదరించినందుకు, మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం కల్పించిన, యు.వి.క్రియేషన్స్‌కి, గీతాఆర్ట్స్‌కి నా కృతజ్ఞతలు. దర్శకుడు రాహుల్‌కి కూడా నా కృతజ్ఞతలు. విజయ్ కూడా చాలా సపోర్ట్ చేశాడు. మీరందరూ థియేటర్స్‌కి వెళ్ళి సినిమాని చూడాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ... కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చెయ్యడంలో మా బన్నీబాబు ఎప్పుడూ ముందు ఉంటాడు. ఈ ఫంక్షన్ చాలా హెల్దీగా సాగుతుంది. ఒక ప్రౌడ్ మూమెంట్ చెప్పాలి. నిన్న కేరళలో చూశాను. బన్నీని మనం ఎలాగైతే అభిమానిస్తున్నామో. వాళ్ళు కూడా అలాగే అభిమానిస్తున్నారు. ఆ విషయంలో చాలా హ్యాపీ. రాహుల్ చెప్పిన కథని విజయ్ నమ్మి మా ఎస్‌కెఎన్ అలాగే యువి క్రియేషన్స్, గీతాఆర్స్ట్ రెండు బ్యానర్స్ మీదరావడం సంతోషంగా ఉంది. టాలెంట్ ఉన్నవ్యక్తులు అందరూ కలిసి తీసిన చిత్రమిది. సినిమా అందరూ చాలా కష్టపడి తీశారు. ఈ సినిమాని అందరూ చూసి ఆదరించాలి. ఎస్‌కెఎన్, నేను కలిసి జర్నీని స్టార్ట్ చేశాం. ఎస్‌కెన్ మంచి ప్రొడ్యూసర్ కావాలని కోరుకుంటున్నాను. రాహుల్‌కి కూడా మంచి పేరు రావాలి. విజయ్ కూడా చాలా నేచరల్‌గా యాక్టింగ్ చేశాడు. అందరూ ఆదరించి ఈ టీమ్‌ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను అందరికీ థ్యాంక్యూ అని అన్నారు.
చిత్ర హీరోయిన్ ప్రియాంక మాట్లాడుతూ... ఇక్కడకి విచ్చేసిన బన్నీగారికి ముందుగా నా కృతజ్ఞతలు. నాకు మీ మీద క్రష్ ఉంది. నేను మీకు పెద్ద అభిమానిని. నాకు ఈ అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు నా కృతజ్ఞతలు అని అన్నారు.
చిత్ర నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ... ముందుగా నేను ఈ స్టేజ్ మీద ఇలా ప్రొడ్యూసర్‌గా ఉండడానికి కారణం గాడ్ ఫాదర్ అల్లుఅరవింద్‌సార్. మాది ఏలూరు ఒక మెగా అభిమానిగా చిరంజీవి, పవన్‌కళ్యాణ్ గారి సినిమాలకు బ్యానర్లు కట్టే నేను అభిమానులంటే బ్యానర్లో పేరు వేచించే వాళ్ళే తప్పించి నాలో టాలెంట్‌ని గుర్తించి ప్రొడ్యూసర్‌గా చేయడం ప్రపంచంలోనే మొట్ట మొదటిసారి జరిగింది. నేను మనస్ఫూర్తిగా అల్లు అరవింద్‌గారికి సెల్యూట్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం దొరకడం చాలా కష్టం. వంశీ నన్ను ఎంకరేజ్ చేశారు. మారుతి ఎంతో బిజీగా ఉన్నా తను ఒక మంచి కథ రాహుల్‌కి ఒక పాయింట్ చెప్పి నాకు ఇచ్చారు. సూపర్ న్యాచరల్ హై ఫై థ్రిల్లర్. ఇంతక ముందు ఎప్పుడూ రాని పాయింట్ ఎవరూ తీయలేదు. ఇండస్ర్టీలో ఎవరికీ ఊరికనే సూపర్ స్టార్ రాదు. వరుసగా మూడు హ్యాట్రిక్లు కొట్టిన హీరో విజయదేవరకొండ.ఇండస్ర్టీని షేక్ చేసిన హీరో విజయదేవరకొండ. ఆయన మమ్మల్ని నమ్మిన నమ్మకం. ఈ సినిమా లీక్ అయినా మేం వీక్ కాలేదు. సో మేమేమి భయపడటం లేదు. నవంబర్ 17న మీ అందర్నీ అలరిస్తుంది. ఇక నా స్టార్ స్టైలిష్ స్టార్ గురించి చెప్పాలి. నా కెరియర్ ఎఎతో స్టార్ట్ అయింది. నాకు ఏదన్నా జాబ్ ఇప్పించమన్నా నువు పిఆర్ ఓ చెయ్యమన్నారు బన్నీగారు నాకు చాలా హెల్ప్ చేశాడు. తనతో పాటు తనవాళ్ళు కూడా ఎదగాలని కోరుకుంటారు. తను ఒక లీడర్. ఎంత మందికి చాలా చాలా రకాలుగా హెల్ప్ చేస్తారు. 2009 కళ్యాణబాబు ఇంటికి వెళ్ళాను. టివి9లో మానేశావంటగా అన్నారు. అవును అన్నా వెంటనే ఒక కవర్ తెచ్చి ఇచ్చి ఉంచుకో అన్నారు. ఏదన్నా ఇబ్బంది కలిగితే చెప్పు అని వెళ్ళారు.ఇంత మంచి వ్యక్తులు కాబట్టే అంత మంచి స్టేజ్‌లో ఉన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ... శ్రీను ఇంత బాగా మాట్లాడేశాక ఇంక ఏం మాట్లాడాలో తెలియడంలేదు. అతను ఎన్ని నెలలు ప్రిపేర్ అయ్యాడో తెలియదు. శ్రీను మాట్లాడి తన బయోపిక్‌ని చూపించాడు మనందరికీ. విజయ్ చాలా వెరైట్ సబ్జెక్ట్స్ తీసుకుంటాడు.స్టోరీ డిఫరెంట్‌గా ఉంటేనే చేయడానికి ఒప్పుకుంటాడు. రాహుల్ కంగ్రాట్స్ టు యు. ఆల్ ద బెస్ట్. హీరో్యిన్ కి కూడా ఆల్ ద బెస్ట్. మా బ్యానర్‌లో చాలా హిట్స్ వచ్చాయి. గీతగోవిందం ఒక నెక్స్ట్ లెవల్‌కి తీసుకువెళ్ళింది థ్యాంక్యూ ఫర్ దట్ విజయ్. టీమ్ అందరికీ నా కృతజ్ఞతలు.
హీరో విజయదేవరకొండ మాట్లాడుతూ... ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన బన్నీ అన్నకి చాలా థ్యాంక్స్. పెళ్ళిచూపులు తర్వాత నన్ను పిలిచి మాట్లాడారు. అర్జున్‌రెడ్డి సినిమా చేసినప్పుడు కూడా గీతాఆర్ట్స్ ఆఫీస్‌కి పిలిచి డోర్ వేసి 20 నిమిషాలు మాట్లాడారు. గీతగోవిందం టైంలో కూడా నా పక్కన కూర్చుని మాట్లాడారు. థ్యాంక్యూ అన్న నాకు మీరు ఇంత సపోర్ట్ అందిస్తున్నందుకు. నేను మొన్న మొన్నే వచ్చా నేను చేసిన సినిమాలు వేళ్ళపైన లెక్కపెట్టవచ్చు బన్నీ అన్నలాగా డాన్స్ నేను చెయ్యలేను. నేను మీకు ఎందుకు నచ్చుతున్నానో నాకు తెలియడం లేదు. నేను చేసే సినిమాలు మీకు నచ్చిఉంటాయి నన్ను ఇష్టపడడానికి కారణం. మనకు ఉన్నది మన ధ్యైర్యం, మన కష్టం. దాని పైనే పైకి రావొచ్చు. గీతాఆర్ట్స్ వాళ్ళు నాకు దారిని చూపించారు. ఎలాంటి సినిమాలు చెయ్యాలని నాకు గైడెన్స్ ఇచ్చారు. విష్ణు నా ఫ్రెండ్ హాలీవుడ్ అనే రోల్ చేశాడు. చాలా బాగా చేశాడు. చాలా ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను. సాయి రైటర్ మనోడు సినిమా స్టార్ట్ అయ్యేముందు పొలం అమ్మకానికి పెట్టాడు. ప్రొడక్షన్ నుంచి డబ్బులు రాగానే పక్కన పెట్టాడు. సాయి గ్రేట్ రైటర్. ప్రియాంక ఈమె అనంతపూర్ యాక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చింది. ఆడిషన్స్‌కి ఇచ్చి మూవీకి సెలెక్ట్ అయింది. ఈ సినిమా కోసం సంవత్సరంనర నుంచి వెయిట్ చేస్తుంది. రాహుల్ కూడా ఇంజనీరింగ్ చదువుతూ ఫిలిం మేకింగ్ గురించి ఇంటర్నెట్‌కి వెళ్లి మేకింగ్ గురించి చదువుతూ నేర్చుకున్నాడు. చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు తన కెరీర్ సెటిల్ కావాలని కోరుకుంటున్నాను. సుజిత్ కెమెరామెన్ తను నెక్ ప్రాబ్లమ్‌తో ఉన్నాడు. నాకోసం బెల్ట్ వేసుకుని కష్టపడి చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. జేక్స్ వాళ్ళ ఫాదర్ క్యాన్సర్‌తో బాదపడుతున్నారు. అయినా చాలా కష్టపడ్డారు. సినిమా అనేది ఒక ఎంటర్‌టైన్మెంట్ కాని దాని వెనకాల చాలా మంది జీవితాలు ఉంటాయి. నేనెప్పుడూ ఎవర్నీ ఏమీ అడగలేదు. అందరూ ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా థియేటర్స్‌కి వెళ్ళి చూడండి. ఎవ్వరూ పైరసీ చెయ్యకండి ప్లీజ్ అందరూ చూడండి. వంశీ అన్న, అరవింద్‌గారు మీ అందరి సపోర్ట్‌కి థ్యాంక్యూ అని అన్నారు.
సదరన్ స్టార్ అల్లుఅర్జున్ మట్లాడుతూ... ఈ సినిమాకి రైటర్‌గా పనిచేసిన సాయిగారికి ముందుగా కృతజ్ఞతలు. ఎందుకంటే మన కల్చర్‌ని ముందుకు తీసుకువెళ్లేది లిటరేచర్ మాత్రమే. రైటర్స్ చాలా కష్టపడతారు కాని లీస్ట్ ఐడెంటిటీ వస్తది. కాని నేను అందరికీ చెప్పేది ఫస్ట్ అందరూ రైటర్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఈ సినిమాకి పనిచేసిన టెన్నీషియన్స్ పేరు పేరున ప్రతి ఒకళ్ళకి నా కృతజ్ఞతలు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. విజయ్ నీ డ్రస్ అదిరిపోయింది. ఈ సినిమాలో పనిచేసిన ప్రియాంక క్రష్ ఉందని చెప్పావు నేనేమి చెయ్యలేను ఇప్పుడు చెప్పి ఏం లాభం. ప్రియాంక మరాఠీ అమ్మాయి కాని అనంతపురంలో పెరిగింది. తెలుగు తనాన్ని ఇష్టపడేవారు ఎవరైనా తెలుగువారే మన తెలుగు అమ్మాయే. నేను నా తమ్ముడు మీటూ గురించి వచ్చినప్పుడు అనుకుంటాం అమ్మాయిలు చెయ్యాలి కష్టపడాలి అని. చాలా క్లీన్ అండ్ మంచి ఇండస్ర్టీ అంటే అది తెలుగు ఇండస్ర్టీ. మీరు హీరోయిన్స్‌ని అడగండి తెలుగు ఇండస్ర్టీలో హీరోయిన్స్‌కి రెస్‌పెక్ట్ ఉంటుంది. ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే ఎస్‌కెఎన్ చాలా హార్డ్ మెగా అభిమాని . చిన్న చిన్నగా కష్టపడుతూ చాలా మంచిగా ఈ రోజు ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగిన వ్యక్తుల్లో ఎస్‌కెఎన్ ఒకరు. ఎస్‌కెఎన్ ఐ యామ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. తను ఆఫీస్‌కి వచ్చి. బాబు ప్రీ రిలీజ్‌కి రావడానికి మీకేమైన అభ్యంతరమా అని అడిగాడు. అభ్యతరం ఏముంటది అంటే. విజయదేవరకొండ ఫంక్షన్‌కి ఒకసారి వచ్చారు కదా అన్నాడు. ఇష్టమైన మనికి రావడం కష్టం కాదు. విజయదేవరకొండ స్టైల్లో చెప్పాలంటే నచ్చిన అమ్మాయికి ఎన్నిసార్లు ముద్దు పెట్టినా బోర్‌కొట్టదు. విజయ్ సింగిల్ బాయ్స్ మీద జోక్స్ వేస్తే ప్రాబ్లమ్స్ ఉండవు. యువి పిక్చర్స్ నాకు చాలా నచ్చిన ప్రొడ్యూసర్స్. నేను పిలిచి మరీ మనిద్దరం కలిసి సినిమా తీస్తే బావుంటదని అడిగిన ఏకైక ప్రొడ్యూసర్స్. నా సొంత మనిషి బన్నీ వాసు, ఎస్‌కెఎన్ ఇద్దరూ ప్రొడ్యూసర్స్‌గా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఎవరైనా సరే నా ముందు ఎదిగితే నాకు చాలా సంతోషం. ఈ రోజు ట్రిపుల్ ఆర్ ఆర్ ఫిల్మ్ లాంచ్ అయింది. నా ఫేవరెట్ మెగాపవర్‌స్టార్ రాంచరణ్‌కి, నేను సరదాగా పిలుస్తాను జూనియర్ ఎన్టీఆర్‌ని బావా అని నా బావకి, ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా రాజమౌళిగారికి ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. విజయ్ నెక్స్ టైం నీ ఈవెంట్‌కి నాకు ఒక మంచి డ్రస్ డిజైన్ చేసిపెట్టాలి. ఓకేనా తప్పకుండా నేనే చేస్తాను మీకు డిజైన్ అని విజయదేవరకొండ అన్నారు. నువు చాలా మంచి డాన్సర్. విజయ్ దగ్గర ఒరిజినాలిటీ ఉంటుంది. అది జనాలకి నచ్చింది. విజయ్ ఈజ్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్. మేమందరం ఒక గోల్డెన్ ప్లేట్ నుంచి వచ్చాం. తను ఎవడేసుబ్రమణ్యం నుంచి స్టెప్ బై స్టెప్ చాలా కష్టపడుతూ ఎదుగుతూ వచ్చారు. నేను ఎంత పెద్ద యాక్టర్ అయినా కావొచ్చుకాని ఐ నెవర్ మేడ్ సెల్ఫ్. తను చెక్కుకున్న శిల్పం తను. నేను టాలెంట్ ఉన్నవాళ్ళమీద జోక్స్ వెయ్యలేను. ఇష్టముండదు. సొసైటీలో ఎంత ఎదిగితే అంత నెగిటివిటీ కూడా ఒక్కోసారి వస్తుంది.విజయ్ నువ్ అవేమి పట్టించుకోవద్దు. ఐ రియాల్లీ ఎంజాయ్ యువర్ సక్సెస్. ఒక సినిమాకి ఇంత మంది కష్టపడ్డారంటే దాని వెనుక ఎన్ని జీవితాలున్నాయని ఆలోచించండి. దయచేసి పైరసీని ఎంకరేజ్ చెయ్యకండి. థియేటర్స్‌కి వెళ్లి సినిమాని చూడండి. థ్యాంక్యూ ఆల్ అని అన్నారు.
This website uses cookies.