వినయ విధేయ రామ చిత్రం దేని గురించి ?
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్‌లో వస్తోన్న వినయ విధేయ రామ టీజర్ విడుదల అయ్యింది. చరణ్ ను పక్కా మాస్ హీరోగా బోయపాటి చుపించబోతున్నదని టీజర్ చూస్తే తెలుస్తోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్ చరణ్ అన్నయ్యలుగా నటిస్తున్నారు. సినిమా ఎక్కువభాగం అన్నా తమ్ముళ్ల మధ్య ఉంటుందని సమాచారం. బ్రదర్స్ మధ్య బాండింగ్ఈ చిత్రంలో మెయిన్ హైలెట్ కాబోతోందని సమాచారం. వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా నటించినట్లు సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ కానుందని టాక్ వినిపిస్తోంది.
This website uses cookies.