'RX 100' ఫేంకార్తికేయ హీరోగా,
టీఎన్ కృష్ణ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మాతగా
''హిప్పీ'' సినిమా షూటింగ్
రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం
RX 100 చిత్రంతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకొన్న కార్తికేయ , దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను, దర్శకుడు టీఎన్ కృష్ణ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం హిప్పీ. వీ క్రియేషన్స్ పతాకం పై రూపొందిస్తున్న హిప్పీ చిత్ర షూటింగ్ శుక్రవారంహైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాత కలైపులి థాను క్లాప్ ఇచ్చారు .
ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ.. " RX 100 సినిమా తర్వాత చాలా స్క్రిప్టులు విన్నాను. ఆ తర్వాత ఎలాంటి కథతో సినిమా చేయాలనే విషయంపై క్లారిటీ లేకపోయింది. ఆర్ఎక్స్ 100 చిత్రానికి భిన్నంగా ఉండే సినిమా, క్యారెక్టర్ చేయాలని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు టీఎన్ కృష్ణ ఈ సినిమా కథ చెప్పారు. కథ విన్న తర్వాత బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను. ఆ తర్వాత నిర్మాత కలైపులి థాను ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలిసింది. దాంతో మరింత ఉత్సాహం కలిగింది. కలైపులి థాను దక్షిణాదిలో ఎంత పెద్ద నిర్మాతో అందరికీ తెలుసు. కబాలి లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసిన నిర్మాత, బ్యానర్‌లో నటించడం, అలాంటి ప్రొడ్యూసర్‌తో నా కెరీర్ ఆరంభంలో రెండో సినిమా చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా నా కెరీర్ని టాప్ లెవెల్‌కు తీసుకెళ్తుందని బలంగా నమ్ముతున్నాను'' అని అన్నారు.
దర్శకుడు టీఎన్ కృష్ణ మాట్లాడుతూ..'' దర్శకుడిగా నాకు తెలుగులో తొలి స్ట్రెయిట్ చిత్రం హిప్పీ. హిప్పీ అంటే కేర్ ఫ్రీ. కథ కూడా అలాగే ఉంటుంది. హీరో కార్తికేయ నటించిన ఆర్ ఎక్స్ 100 మూవీ చూశాను. నాకు బాగా నచ్చింది. కార్తికేయ బాడీలాంగ్వేజ్‌కు చక్కగా సరిపోయే చిత్రం ఇది. ఆర్ఎక్స్ 100 లాంటి పెద్ద హిట్ తర్వాత కార్తికేయ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయనతో సినిమా చేయడం ఛాలెంజ్‌గా అనిపిస్తున్నది. వెరీ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ ఇది . ఈ చిత్రానికి ఆర్ డీ రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తమిళంలో మంచి క్రేజ్ ఉన్న సంగీత దర్శకుడు నివాస్ ఈ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది'' అని అన్నారు.
సినిమాటోగ్రాఫర్ ఆర్‌డీ రాజశేఖర్ మాట్లాడుతూ.. ''సూర్య, జ్యోతికతో కృష్ణ రూపొందించిన నువ్వు నేను ప్రేమ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. ఈ సినిమా కోసం మళ్ళీ అతడితో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. కృష్ణ ఎనర్జిటిక్ డైరెక్టర్. హిప్పీ క్రేజీ టైటిల్. కథ చెప్పినప్పుడు వెంటనే షూటింగ్‌కు వెళ్లిపోదామనిపించింది. ఎందుకంటే నాకు కథ అంత బాగా నచ్చింది. గతంలో నేను తెలుగులో హ్యాపీ, ఘర్షణ చిత్రాలకు పనిచేశాను. మళ్లీ హిప్పీ కి పనిచేయడం చాలా ఉత్సాహంగా ఉంది. హీరో కార్తీకేయ అనగానే ఆయన నటించిన ఆర్‌ఎక్స్ 100 చూశాను. కార్తీకేయకు ఈ కథ చక్కగా సరిపోతుంది. సరైన కథకు సరైన హీరో లభించాడు. కార్తికేయ అనగానే సగం సక్సెస్ సాధించినంత ఫీలింగ్ కలిగింది. కార్తికేయ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లడం ఖాయం. పక్కాగా రూపొందిన పూర్తి స్క్రిప్టును లాక్ చేశాం. హైదరాబాద్‌తోపాటు శ్రీలంక మరికొన్ని లోకేషన్ల లో షూట్ చేస్తాం'' అని అన్నారు.
నిర్మాత కలైపులి థాను మాట్లాడుతూ.. ''హిప్పీ సినిమా కథ తెలుగు వారందరికీ నచ్చుతుంది. ఆర్‌ఎక్స్ 100 సినిమా చూసిన తర్వాత కార్తికేయ ఈ సినిమాకు యాప్ట్ అనిపించింది. కార్తికేయ కథ వినగానే ఓకే అన్నారు. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తాం. ఆ తర్వాత శ్రీలంకలో ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు .
నటీనటులు:
కార్తికేయ , జేడీ చక్రవర్తి, దిగంగన, జజ్బా సింగ్, బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: టీఎన్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: ఆర్‌డీ రాజశేఖర్
సంగీతం: నివాస్ కే ప్రసన్న
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
సాహిత్యం: అనంత శ్రీరాం
మాటలు: టీఎన్ కృష్ణ, కాశీ నడింపల్లి
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
ఆర్ట్: మిలన్ ఫెర్నాండేజ్
క్యాస్టూమ్: ప్రవీణ్
మేనేజర్లు: గోపి, ఏపీ పాల్ పా0డి
పీఆర్‌వో: పులగం చిన్నారాయణ
డిజైన్లు: తండోరా
This website uses cookies.