కర్త కర్మ క్రియ నీకు నువ్వే!!- నాగు గవర
క్రైమ్ థ్రిల్లర్ గా యువ దర్శకుడు నాగు గవర తెరకెక్కించిన చిత్రం” కర్త కర్మ క్రియ”. లిమిటెడ్ బడ్జెట్ లో కంటెంటె ప్రధాన బలంగా నాగు దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా” కర్త కర్మ క్రియ ” ఈ రోజు విడుదలై ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటోంది. కొత్త నటీనటులను లీడ్ రొల్స్ లో పరిచయం చేయటంతో పాటు, వైవిధ్యమైన చిత్రాలను అందించె చదలవాడ బ్రదర్స్ బ్యానర్ పై మరో హిట్ మూవీని దర్శకుడు నాగు అందించాడు. భారీ చిత్రాల మధ్య చిన్న సినిమాగా విడుదలై సక్సెస్ ను అందుకున్న “కర్త కర్మ క్రియ ” ఏ సినిమాకైనా కంటెంటె ఇంపార్టెంట్ అని మరోసారి నిరూపించింది.. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ...
ఈ చిత్ర కాన్సెప్ట్ ఏంటి?
ఇది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్న చాలా నిర్లక్ష్యం. ప్రతి ఒకళ్ళు సెల్ఫీలు తీసుకుంటున్నారు. సమాజంలో ప్రతి ఒకళ్ళ చేతిలో మొబైల్ ఉంటుంది. ప్రతి ఒకళ్ళు సెల్ఫీలు సెల్ఫ్ వీడియోలు తీసుకుంటున్నారు. దానితో పాటు వారి పర్సనల్ వీడియోలు, ఫొటోలు కూడా తీసుకుంటున్నారు. అవి పొరపాటున మన ఫోన్ వేరే వారి చేతికి వెళ్ళి, ఆ ఫొటోలు, వీడియోలు వేరే వాళ్ళకి వెళితే మనం డిలీట్ చేశాం అనుకున్నా డిలీట్ కావు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. దాంతో ఎన్నో రీ కలెక్ట్ చెయ్యవచ్చు. అమ్మాయిలు చాలా నిర్లక్ష్యంగా సెల్ఫీలు పంపుతుంటారు. అది చాలా ప్రమాదకరం. అలా మన పర్సనల్ వీడియోలు, ఫొటోలు బయటకెళితే ఫ్యామిలీస్ ఏమయిపోతాయి అన్న దాన్ని బేస్ చేసుకుని తీసిన మూవీ ఇది. నిర్లక్ష్యంగా ఉంటున్న ఆ విషయాన్ని ఒక సినిమాటిక్‌గా చెప్పాను. ఒక ముగ్గురి వ్యక్తుల గురించి. ఒక హౌస్‌వైఫ్, ఒక జాబ్ చేస్తున్న అమ్మాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకుని వాళ్ళ పర్సనల్ వీడియోలు వేరేవాళ్ళకి దొరికితే వాళ్ళు వాటితో ఎలా ఇబ్బంది పడతారు అన్నది చూపించాము. సినిమా చూసే ఆడియన్స్‌కి ఈ విషయం చివరిలో తెలుస్తుంది. ఎవరు చేశారు. ఎందుకు చేశారు. ఎందుకు ముగ్గురు చనిపోయారు అని దాని పై ఇన్వెస్టిగేషన్ కొనసాగుద్ది. ఫైనల్‌గా వచ్చేసరికి మొబైల్‌ని ఎంత విచ్చలవిడిగా వాడుతున్నాం మనం దాని వల్ల జీవితాలు ఎంత తారుమారు అవుతాయి అనేది కంటెంట్. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒకళ్ళు వాళ్ళ మొబైల్ ఒకసారి చెక్ చేసుకుంటున్నారు. నిన్న సినిమా విడుదల తర్వాత ప్రతి సెంటర్ నుంచి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. మంచి కంటెంట్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అని. ఒక మంచి కంటెంట్‌తో జనాలకి చెప్పాలని చేసిన చిత్రం . నేను ఇంతకు ముందు తీసని చిత్రంలో కూడా తండ్రి గొప్పతనం గురించి తండ్రి అనుబంధం గురించి ఆ చిత్రంలో చెప్పాను. ఇందులో మనం ఫోన్‌ని ఎంత నిర్లక్ష్యంగా వాడుతున్నాం అన్న దాని గురించి చెప్పాను.
అభిమన్యుడు సినిమా కూడా ఇలాంటిదేకదా?
అభిమన్యుడు చిత్రం కంప్లీట్‌గా సైబర్ మీద వెళ్ళారు. నాదగ్గరకి వచ్చే ఆడియన్‌కి ఏదో ఒక మెసేజ్ చెప్పాలని కాదు. సినిమాలో ఒక క్రైమ్ జరిగింది.దాన్ని ఎలా అని తెలుసుకోవడం కోసం. సైబర్ క్రైమ్‌లో చాలా ఉన్నాయి. మిగతావి చాలా మంది వాడతారు వాడకపోవచ్చు. కాని ఫోన్ మాత్రం ప్రతి ఒకళ్ళు వాడతారు. చాలా మంది చాలా విధాలుగా చెపుతారు. నా ఐడియాలజీ ప్రకారం నేను కర్త కర్మ క్రియ లో చెప్పాను. కర్మ సిద్ధాంతం అంటే మంచి చేస్తే మనతో మంచి వస్తది. చెడు చేస్తే చెడు అని. మన సొసైటీ అంతా కూడా కర్మ సిద్ధాంతాల పైనే వెళుతుంది. ఈ సినిమా ఫస్ట్ ఒక లైన్తో స్టార్ట్ అవుతుంది. నా కర్మకి ఎవరూ బాధ్యులు కారు నేనే అని చెప్పి. సినిమా ఫినిషింగ్ అదే డైలాగ్ మెయిన్ యాక్టర్స్ నుంచి వస్తుంది. ఈ సినిమా అంతా కూడా కర్త కర్మ క్రియ మొత్తం చేసేది ఒక్కడే ఆ ఒక్కడు ఎవరు అనే దాని పైన సినిమా చేశాను.
సినిమా రెస్పాన్స్ ఎలా ఉంది?
రెస్పాన్స్ చాలా బావుంది. ఎందుకంటే ప్రతి ఒకళ్ళు ఈ సినిమా కంటెంట్ చాలా బావుంది. ఫస్ట్ ఆఫ్ కన్నా సెకండాఫ్ చాలా బావుంది అంటున్నారు. సాంగ్స్, హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఒక లైవ్‌లీగా వెళుతూ ఇంటర్‌వెల్ నుంచి అందరికి చాలా బాగా నచ్చిందని చెపుతున్నారు. పర్టికలర్‌గా రవివర్మ ఇన్వెస్టిగేషన్ సీన్స్,క్లైమాక్స్ హీరో పెర్ఫార్మెన్స్, గోవాసాంగ్ అన్నీ చాలా బాగా వచ్చాయని చెపుతున్నారు. సెకండాఫ్ అందరికి కనెక్ట్ అయింది. ఒక మీనింగ్ ఫుల్ సినిమా అని అందరికినుంచి కామెంట్స్ వస్తున్నాయి. హీరో హీరోయిన్ కొత్త వాళ్ళైనా కూడా ఎక్కడా కూడా వాళ్ళలో ఆ బెరుకు అనేది లేకుండా చేశారు అని అంటున్నారు. ఇండస్ర్టీకి మళ్ళీ ఒక మంచి హీరో వచ్చాడు అని ఆ అబ్బాయికి ఒక మంచి పేరు వచ్చింది.
ముందు ఈ చిత్రానికి ఎవర్ని ఎంపిక చేశారు?
దీనికి ఎవర్నీ అనుకోలేదు. ఈ సినిమాకి రెండు కాన్పెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇది కొత్త వాళ్ళతోనే చేయాలి. వేరే హీరో చేస్తే అంతగా కనెక్ట్ అవ్వద్దు అక్కడ క్యారెక్టర్ మాత్రమే హైలెట్ కావాలి. ప్రతి ఒకళ్ళు ఆ కారెక్టర్‌లో ఎవర్ని వాళ్ళు చూసుకోవాలి. రెండోది ఈ సినిమాని ఏ మాత్రం కాస్త ఎంటర్‌టైన్మెంట్ తగ్గించినా కంప్లీట్ డార్క్ అయిపోతది. ఈ కంటెంట్ అందరికి సంబంధించినది కాబట్టి కొత్త వాళ్ళు మాత్రమే ఉండాలి. కాకపోతే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కొత్తవాళ్ళతో వెళ్ళకూడదు. వాళ్ళు ప్రశ్నించే విధానం అంతా బావుండాలి. డైలాగ్ మాడ్యులేషన్ బావుండాలి అందుకే రవివర్మని తీసుకోవడం జరిగింది.
సాధారణంగా తెలుగులో హీరోకి కొంత హైప్ ఉంటది మరి మీ చిత్రంలో కొత్త పాయింట్?
హీరో అని అనుకోలేదండి. కేవలం సిద్ధు అనే క్యారెక్టర్ వాడు ఒక సరదా కుర్రాడు. వాడికి కూడా కొన్ని కొన్ని పర్సనల్స్ ఉంటాయి. అలాంటి క్యారెక్టర్స్ మాత్రమే వాడిలో కూడా కొన్ని కొన్ని క్యాపబిలిటీస్ ఉంటాయి. డాన్స్ మంచిగా చెయ్యడం మంచి హైట్ ఉంటాడు కాబట్టి ఏదన్నా గొడవ వస్తే ఫైట్ చెయ్యొచ్చు.జనరల్‌గా నచ్చిన అమ్మాయి కోసం ఫైట్ చెయ్యడం, ఫ్రెండ్‌తో సరదాగా అనేది చూస్తే సిద్ధు క్యారెక్టర్ మాత్రమే కనపడాలి. నేను చూపించిన దాంట్లో క్యారెక్టర్ మాత్రమే కనిపించాలి.ఈ సినిమా క్లైమాక్స్ అందరూ కొత్తగా ఉందని అంటున్నారు తప్పించి బాలేదని అనడంలేదు. ఇటువంటి తప్పుచేసినోడికి ఇలాంటి శిక్షపడాల్సిందే అని.అలాగని బస్తీలో ఉండే కుర్రాళ్ళందరూ అలా ఉంటారని కాదు. ఈజీ మనీ కోసం అడ్డదార్లు తొక్కుతున్న ఎవరికైనా ఇలాంటి పరిస్థితే పడుతుంది. చాలామంది మనం పేపర్లో చూస్తూ ఉంటాం చైన్ స్నాచింగ్ చేస్తూ ఉంటారు. బీటెక్ స్టూడెంట్స్ విలాసాల కోసం చైన్‌స్నాచింగ్ చెయ్యడం గురించి మనం న్యూస్‌లో వింటూనే ఉంటాం. వాడికంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాడు ప్యూర్ క్రిమినల్ కాదు. వాడికున్న సిట్యూషన్‌లో వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని దాని గురించి. అన్ని వేరియేషన్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్‌లో.
రొమాన్స్ లేదు మీ సినిమాలో?
రొమాన్స్ అనేది చాలా జాగ్రత్తగా తీశాను. రొమాన్స్ అంటే ఎక్కడా సినిమాలో ఒక్క లిప్‌లాక్ కూడా లేదు. హగ్‌లు ఉంటేనే రొమాన్స్ అనేది కాదని నా ఫీలింగ్ ఈ సినిమాలో రొమాన్స్‌కి చాలా స్కోప్ ఉంది. దివ్య, మహాలక్ష్మి, కళ్యాణి ముగ్గురికి సంబంధించిన రొమాన్స్ చూపించవచ్చు. ఒక అమ్మాయి ఫొటోగాని, వీడియోగాని బయటకు వెళ్ళకూడదని చెప్పినవాడ్ని అమ్మాయిని పెట్టి రొమాన్స్ ఎలా చెయిస్తానండి. ఆ థాట్ రాంగ్ అవుతది అలా చూపించకూడదు. దాంతోపాటే వాళ్ళ సూసైడ్ చేసుకున్నారు అని చెప్పాను తప్పించి వాళ్ళ చావులను కూడా నేను చూపించలేదు.జనాలకి కూవలం ఆ ఫీల్ అర్ధమయితే చాలు అనుకున్నా.
సడెన్‌గా రిలీజ్ చేశారేంటి?
సినిమా అయిపోయింది. ఈ సినిమా ఏప్రిల్ 17న మొదలయింది. శ్రీనివాస్‌గారు చాలా సినిమాలు చేస్తున్నారు 8 సినిమాల వరకు చేస్తున్నారు. కాబట్టి ఫాస్ట్‌గా చేశాం.ఆయన బ్యానర్ నుంచి వస్తున్న స్ర్టయిట్ ఫిలిం.రీరికార్డింగ్ కూడా అయిపోయింది. దాంతో దీపావళికి రావాలని వచ్చేశాం.అంటే 16 నుంచి చాలా సినిమాలు ఉండడం వల్ల కొంచం ముందుకు వచ్చాం. ఒక ప్రొడ్యూసర్ డెసిషన్.ఈ సినిమా ఎక్కువమందికి రీచ్ అయితే ప్రతిఫలం దక్కినట్లు అనిపిస్తది.
ఇండస్ర్టీలో ఎవరన్నా చూశారా?
చూశారు బావుందన్నారు. పెద్దవాళ్ళు ఇంకా ఎవరూ చూడలేదు బిజీగా ఉన్నారు. నాకున్న సర్కిల్‌లో అందరూ చూశారు.ఫస్ట్‌డే ప్రొడ్యూసర్ సినిమా చూసి హ్యాపీ.ఎందుకంటే ఇంత మెచ్యూర్డ్‌గా తియ్యడం అనేది నచ్చింది.ఈ సినిమాలో గోవాలో సాంగ్ చాలా మందికి బాగా నచ్చింది. క్యూట్ రొమాన్స్ ఉంటది సినిమాలో. ప్రతి సినిమాలోనూ లిప్‌లాక్‌పెట్టి పోస్టర్స్‌లోపెట్టి వేస్తున్నారు కానీ దాని వల్ల సినిమాలు ఆడవు. పర్టికలర్ సీక్వెన్స్‌లో ఇద్దరి మధ్య ఉండే ఫీలింగ్‌ని అవసరమైనంతే ఉండాలి. జనరల్‌గా గోవా సాంగ్ అంటే రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ నీట్‌గా చెయ్యడం నచ్చింది.ఒక సినిమాకి ఉండాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. కొంత మంది నెగిటివ్స్ చెప్పినవి కూడా బావున్నాయి. కాకపోతే ఈ చిత్రాన్ని నేను నాకున్న పరిమితిలో నేను తీశాను.
ప్రొడ్యూసర్స్ ఏమన్నారు?
ముందుగా నేను శ్రీనివాస్‌రావుగారికి కేవలం ఒక లైన్ మాత్రమే చెప్పాను. తర్వాత వాళ్ళు షూటింగ్‌కి వచ్చి చూస్తూ ఉన్నారు. ప్రతీ సారి సర్‌ప్రైజ్ అవుతూ ఉన్నారు, చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ సీన్స్ తీస్తున్నప్పుడు ఆయన షూటింగ్ కి వచ్చి చూసి చాలా ఎంజాయ్ చేసే వారు. ఆయన ఒక ఆడియన్‌లా చూడటాన్ని ఇష్టపడతారు. ఆయన మానిటర్‌ని చూస్తూ యాక్ట్ చేస్తున్న యాక్టర్స్‌ని చూస్తూ చాలా ఆనందపడిపోతుంటారు.షూటింగ్ విషయంలో చాలా హ్యాపీ. టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్‌కి కూడా చాలా హ్యాపీ. సినిమా చూశాక ఆయన నాతో నేనే నీతో చాలా మాట్లాడాలి అన్నారు. తర్వాత మాట్లాడతా అన్నారు. కాదు సార్ ముందు చెప్పండి యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీరు చెపితే నాకు ఆనందంగా ఉంటుంది అన్నాను.సినిమా చాలా చాలా బావుంది. హీరోకి మంచి అవకాశాలు దొరుకుతాయి. మా డీఓపీని పట్టుకుని మాకు చాలా మంచి విజువల్ ఇచ్చారు చాలా బావుంది అని అన్నారు.అందర్నీ మెచ్చుకుని చాలా ఆనందంతో వెళ్ళారు.
తర్వాత సినిమా కూడా సేమ్ బ్యానరా?
ఇంకా తెలియదు. ఒక కథ అయితే చెప్పాను.స్టోరీ కూడా ఓకే అన్నారు. చూడాలి మరి. కమర్షియల్ ఫార్మెట్‌లో, ఒక లవ్ స్టోరీ ఉంది. ఆయనకు చెప్పింది మాత్రం పోలీస్ స్టోరీ. అది ఆయనకు నచ్చింది బాగా. హీరో డేట్స్, లేక కొత్తవాళ్ళతో చేస్తామా అన్నది చూడాలి. సబ్జెక్ట్స్ మాత్రం చాలా నే ఉన్నాయి. బెటర్ క్వాలిటీతో ఈ సినిమా తీసుకొచ్చాను.
ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి గ్యాప్ ఎందుకు వచ్చింది?
గ్యాప్ ఏమీ లేదు.ఫస్ట్ సినిమా తర్వాత ఆలీగారితో సంజయ్‌రామస్వామి అని చేశాను. కాని అది కొన్ని డిజిటల్ ప్రాబల్మ్స్ డీమానిటైజేషన్ టైంలో ఆగిపోయిన సినిమాల్లో నాది ఒకటి. తర్వాత ఒక ప్రముఖ హీరోకి స్టోరీ డైలాగ్స్ ఇచ్చాను అది అవుతదని అనుకున్నాం కానీ అదికూడా ఆగింది. అలా రెండు సినిమాలు ఆగాయి. చాలా సినిమాలు ఓపెన్ అయి ఎనౌన్స్ అవుతాయి గాని ఏ స్టేజ్‌లో ఆగిపోతాయో ఎవరికీ తెలియదు. మంచి కాన్సెప్ట్‌తో చేద్దాం అని ఎదురు చూసే టైంలో మన మీడియా ఫ్యామిలీ ద్వారా నాకు ఈ అవకాశం దక్కింది. మన భాగ్యలక్ష్మి, మోహన్ గారి ద్వారా వినాయకరావుగారికి కథ చెప్పగా ఆయనకు నచ్చి ఆయన నన్ను శ్రీనవాస్‌గారికి పరిచయం చెయ్యడం జరిగింది. ఇందులో వినాయకరావుగారి అబ్బాయి హర్ష విలన్ క్యారెక్టర్ చేశారు చాలా బాగా నటించారు. తను ఇంత వరకు చేసిన క్యారెక్టర్స్‌లో ఈ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. డాక్టర్ ఆనంద్ రోల్‌లో నటించారు చాలా బాగా చేశారు.
This website uses cookies.