Social News XYZ     

Srinu Vaitla convinces Ileana

ఇలియానాను ఒప్పించిన శ్రీనువైట్ల!

రవితేజ 'అమర్ అక్బర్ ఆంటొని' సినిమాతో టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానా ఈ సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పింది. మొదట డబ్బింగ్ చెప్పడానికి ఇలియానా నిరాకరించిందని, తరువాత దర్శకుడు శ్రీను వైట్ల ఆమెకు ''నీ పాత్రకు నువ్వే డబ్బింగ్ చెబితే బాగుంటుంది'' అని చెప్పడంతో ఆమె తన పాత్రకు తాను సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నట్లు సమాచారం. నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో హిట్ కొడితే పలు చిత్రాలు ఆమెను వరిస్తాయి. .

ఈ సినిమా విజయం తనకు కీలకంగా మారింది. రవితేజ ఈ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీనివాస్ రెడ్డి, సునిల్, రఘుబాబు, సత్య వంటి కమిడియన్స్ చిత్రంలో ప్రేక్షకులను నవ్వించబోతున్నారని సమాచారం. తమన్ అందించిన పాటలు బాగున్నాయి. ఇదివరుకు విడుదలైన రెండు సాంగ్స్ ఆకట్టుకున్నాయి. శ్రీనువైట్ల తన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు కావున ఈ మూవీ తనకు మంచి బ్రేక్ తెచ్చి పెట్టాలని స్క్రిప్ పై బాగా హోం వర్క్ చేసినట్లు సమాచారం. ఈ చిత్ర ప్రీ రిలీస్ ఈవెంట్ ఈ నెల 10 న గ్రాండ్ గా చెయ్యబోతున్నారు.

 

Facebook Comments