పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో "పల్లెవాసి"
త్రిషాల్ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల సాయినాధ్ దర్శకుడిగా జి.రాంప్రసాద్ నిర్మిస్తొన్న చిత్రం "పల్లెవాసి".ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి హీరోగా నటిస్తున్నాడు. రాకేందు సరసన కల్కి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ " వినాయకచవితి సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ అందరినీ ఎట్రాక్ట్ చేసేలా ఉందని ఫీడ్ బ్యాక్ లభించింది. ఆ రెస్పాన్స్ తో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. ముఖ్యంగా సినిమాలో రాకేందు మౌళి నటన అందరి హృదయాలను కట్టిపడేస్తుంది. సందీప్ అందించిన స్వరాలకు వెన్నెల కంటి, రాకేందు మౌళిల సాహిత్యం చక్కగా కుదిరింది. కథలో భాగంగా వచ్చే పాటలు అందరినీ అలరిస్తాయి. ఇక వేసవి కాలంలో కుండలోని నీరంత చల్లగా..చలి కాలంలో చలి మంటంత వెచ్చగా...కరువు నేలలో పండిన వేరు శనగంత రుచిగా... తొలకరికి నెర్రలు దాచిన నేల పరిమలాంటి అనుభూతి ని 'పల్లెవాసి' కచ్చితంగా కలిగిస్తుందని" అన్నారు.
నిర్మాత రాంప్రసాద్ మాట్లాడుతూ..ఇటీవలే షూటింగ్ పూర్తి అయింది. అనుకున్న బడ్జెట్ లో తక్కువ సమయంలోనే సినిమాను పూర్తి చేయగలిగాము. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే 'పల్లెవాసి ' ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.
ఈ చిత్రానికి రచన, నిర్మాత: జి. రాం ప్రసాద్
సహా నిర్మాత : ఉదయ్ కుమార్ యాదవ్
కెమెరామెన్: లక్ష్మణ్,
కో డైరెక్టర్: శ్యాం,
సంగీతం : కె .సందీప్ కుమార్
ఎడిటర్ :జానకిరామ్ పామరాజు
పి.ఆర్.ఓ : సాయి సతీష్ ,
దర్శకత్వం: గోరంట్ల సాయినాధ్
This website uses cookies.