Social News XYZ     

Suresh Productions has 6 movies in the pipeline

సురేష్ బాబు భారీ ప్లానింగ్ !

లేటెస్ట్ గా సురేష్ బ్యానర్ లో మహేంద్ర అనే కొత్త దర్శకుడితో పూర్తి తెలంగాణ యాసతో 'దొరసాని' సినిమా జరుగుతోంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు, రాజశేఖర్ కుమార్తె శివాని హీరోయిన్. క్షణం సినిమాతో విజయం సాధించిన దర్శకుడు రవికాంత్‌ దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. గుంటూరు టాకీస్ చిత్ర హీరో సిద్దు ఈ సినిమాలో హీరో. సమంత హీరోయిన్ గా లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో కొరియన్‌ చిత్రం 'మిస్‌ గ్రాని'ని రీమేక్‌ మొదలుకాబోతోంది.

విక్టరీ వెంకటేశ్‌, నాగచైతన్య కాంబినేషన్ లో 'వెంకీమామ' రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. బాబీ ఈ చిత్రానికి దర్శకుడు. అలాగే వెంకటేశ్‌ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌తో ఒక సినిమా ఉంటుంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో హిరణ్య కశిప ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉంది. రానా ఈ సినిమాలో హీరో. నీది నాది ఒకే కథ సినిమాతో విజయం సాధించిన వేణు ఊడుగుల దర్శకత్వంలో నిజ ఘటనల ఆధారంగా ఓ బయోపిక్‌ తెరకెక్కనుంది. ఇలా అరడజను పైగా సినిమాలు సురేష్ ప్రొడక్షన్ లో ప్రారంభం కానున్నాయి.

 

Facebook Comments