Social News XYZ     

Short Film Film Festival On November 17 By Krystal Minds And Visista Innovations

క్రిస్టల్ మైండ్స్ మరియు విశిష్ట ఇన్నోవేషన్స్ ఆధ్వర్యంలో నవంబర్ 17న షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్

క్రిస్టల్ మైండ్స్ మరియు విశిష్ట ఇన్నోవేషన్స్ సంయుక్తంగా క్రియేటివ్ టీమ్ సమర్పణలో హైదరాబాద్‌లో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగబోతోంది. సూపర్ స్టార్ కృష్ణగారి ఆశీస్సులతో జరుగనున్న ఈ ఫెస్టివల్‌లో విజేతలకు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి బహుమతులు అందజేయనున్నారు. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు, దర్శకులు జ్యూరీ మెంబర్స్‌గా జరుగనున్న ఈ కార్యక్రమంలో టాప్ టెన్ చిత్రాలను నవంబర్ 17వ తేదీన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రదర్శించనున్నారు. అదే రోజు ఈ టాప్ టెన్‌ నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ చిత్రాలను సెలక్ట్ చేసి మొదటి విజేతకు రూ. 50 వేలు, రెండవ విజేతకు రూ.30 వేలు, మూడవ విజేతకు రూ. 20 వేలు బహుమతిగా అందజేయనున్నారు.

రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ. 500/- చెల్లించవలసి ఉంటుంది. అలాగే షార్ట్ ఫిల్మ్ మ్యాగ్జిమమ్ డ్యూరేషన్ 15 నిమిషాలు ఉండాలి.
రిజిస్ట్రేషన్ కోసం గడువు నవంబర్ 13వ తేదీ వరకు మాత్రమే.

 

ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, షరతుల కొరకు www.krystalminds.in లో పొందుపరచబడ్డాయి.

Facebook Comments
Short Film Film Festival On November 17 By Krystal Minds And Visista Innovations

About uma