Rajamouli to reveal RRR backstory on the launch day?

రాజమౌళి బిగ్ అనౌన్స్మెంట్ !

ఆర్ఆర్ఆర్ పేరిట రాజమౌళి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు ఏడాదిగా ఈ కథ ఫై కూర్చున్న రాజమౌళి తాజాగా ఈ సినిమాను అక్టోబర్ 11న ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. ఇదే నెలలో సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి విషయాలు బయటికి రానివ్వకుండా రాజమౌళి జాగ్రత్త పడుతున్నారు.

ఎన్టీఆర్, చరణ్ చిత్ర సెట్స్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చే పనిలో ఉన్నారు. హైదరాబాద్ సిటీ బయట అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది.

సినిమా ఓపెనింగ్ రోజున విలేకరుల సమావేశంలో రాజమౌళి చిత్ర బ్యాక్ గ్రౌండ్ గురించి వివరించబోతున్నట్లు సమాచారం. స్వాతంత్య్రం ముందు జరిగిన ఒక కథగా ఈ సినిమా కథాంశం ఉండబోతోందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని రాజమౌళి చెప్పబోతున్నట్లు సమాచారం.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%