Social News XYZ     

Children’s Film Antha Vichitram To Release On November 10th

నవంబర్ 10న వస్తున్న
బాలల చిత్రం "అంతా Vచిత్రం"

Children's Film Antha Vichitram To Release On November 10th

అయాన్ ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వరావు (కన్నారావు) ఆశీస్సులతో- ఎర్రోజు వెంకటాచారి సమర్పణలో మహ్మద్ అస్లాం నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం 'అంతా విచిత్రం'. జి.శ్రీను గౌడ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి జై రామ్ కుమార్ దర్శకుడు. సాయి ప్రణీత్, లిఖిత్, బిట్టు, నీరజ్, రాజేంద్ర, విజయ్ భాస్కర్ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి భోలే షావలి సంగీతం సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. బాలల దినోత్సవం (నవంబర్ 14) సందర్భంగా ఎం.జి.ఎం ద్వారా  ఈనెల 10 న విడుదల కానుంది.

 

ప్రముఖ హాస్య కథానాయకుడు అలీతో 'తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసిన జై రామ్ కుమార్ 'అంతా విచిత్రం' చిత్రాన్ని అత్యంత వినూత్నమైన కథాంశంతో తెరకెక్కించారు.

ఈ చిత్రం చూసి ఎంతో ఇంప్రెస్ అయిన ఎం.జి.ఎం మూవీస్ అధినేత ఎం.అచ్చిబాబు.. రెండు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంగీత దర్శకులు బోలె షావలి, విలన్ పాత్రధారి సాయి ప్రణీత్, ఆటా ఫైవ్ బిట్టూ. సమంత పాత్రధారి రేవతి, జూనియర్ ఎన్టీఆర్ పాత్రధారి లిఖిత్, పవన్ కళ్యాణ్ పాత్రధారి సాయి నీరజ్ పాల్గొన్నారు!!

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి సూపర్ హీరోల ఫాన్స్ అయి ఉండి, వాళ్ళను నిజ జీవితంలో అనుకరిస్తుండే కొందరు చిన్న కుర్రాళ్ళ కథతో ఈ చిత్రం రూపొందింది.

ఇషికావర్మ, రేవతి కళ్యాణ్, సమ్రీన్, కావేరి ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి స్టోరీ డైలాగ్స్: రమా రామ్ కుమార్, ఫోటోగఫి: మురళీకృష్ణ, ఎడిటర్: ఆవుల వెంకటేష్, సహ నిర్మాత: జి.శ్రీనుగౌడ్, సమర్పణ: ఎర్రోజు వెంకటాచారి, రిలీజ్: ఎం.జి.ఎం., నిర్మాత: మొహ్మద్ అస్లాం, స్క్రీన్ ప్లే-డైరెక్షన్: జై రామ్ కుమార్!!

Facebook Comments
Children's Film Antha Vichitram To Release On November 10th

About uma