Rayalaseema Love Story movie motion poster released by director G. Nageswara Reddy

డైరెక్టర్ జి . నాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా రాయలసీమ లవ్ స్టోరీ మోషన్ పోస్టర్ విడుదల

వినోద ప్రధాన చిత్రాలకు పెద్ద పీట వేసే దర్శకులు జి . నాగేశ్వర్ రెడ్డి  రాయలసీమ లవ్ స్టోరీ చిత్ర మోషన్ పోస్టర్ ని , ఫస్ట్ లుక్ ని  విడుదల చేసారు . ఏ వన్ ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్ పతాకంపై రామ్ రణధీర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పంచ లింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా - నాగరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం '' రాయలసీమ లవ్ స్టోరీ ''. వెంకట్ ని హీరోగా పరిచయం చేస్తూ హృశాలి గోసవి ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ఈ రాయలసీమ లవ్ స్టోరీ . తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన పావని మరో హీరోయిన్ గా నటిస్తోంది . నాగినీడు , నల్లవేణు , పృథ్వీ , జీవా , తాగుబోతు రమేష్ , అదుర్స్ రఘు , గెటప్ శ్రీను , మధుమణి ,మిర్చి  మాధవి ,జబర్దస్త్ కొమరం ,రాజమౌళి , సన్నీ , భద్రం , ప్రసన్న కుమార్ తదితరులు నటించిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని , మోషన్ పోస్టర్ ని దర్శకులు జి . నాగేశ్వర్ రెడ్డి రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేశారు . రాయలసీమ లవ్ స్టోరీ టైటిల్ లోనే ఏదో మ్యాజిక్ ఉందని , ఇప్పటివరకు రాయలసీమ నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉన్నట్లు అందునా యువతకు నచ్చేలా అన్ని అంశాలు ఉన్న చిత్రంగా కనిపిస్తోంది . ఈరోజుల్లో సినిమాలు తీయడం , వాటిని రిలీజ్ చేయడం చాలా కష్టం అలాంటిది మా ప్రాంతం నుండి వచ్చిన ఈ చిత్ర బృందం సినిమాని దిగ్విజయంగా పూర్తిచేయడమే కాకుండా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేస్తున్నారు అంటే గొప్ప విషయమే ! ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ లతోనే మన సినిమా ఎలా ఉండబోతోందో స్పష్టంగా చెప్పగలగాలి అలా ఈ రాయలసీమ లవ్ స్టోరీ ఉందనిపిస్తోంది . యువతకు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని ఈ పోస్టర్ చూస్తేనే తెలుస్తోంది . ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ లతోనే అంచనాలు పెరిగేలా చేసిన యూనిట్ ని అభినందిస్తున్నాను అలాగే సినిమా మంచి విజయం సాధించాలని అందరికీ మంచి పేరు రావాలని ఆశిస్తున్నామన్నారు .

దర్శకులు రామ్ రణధీర్ మాట్లాడుతూ " నాపై పూర్తి నమ్మకంతో ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టారు నిర్మాతలు , వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అద్భుతమైన ఔట్ ఫుట్ వచ్చింది ,నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతలకు నా కృతఙ్ఞతలు  . యువతని టార్గెట్ చేస్తూ రూపొందించిన మా రాయలసీమ లవ్ స్టోరీ చిత్రం తప్పకుండా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది . మా చిత్రంలో అద్భుతమైన పాటలున్నాయి , ఎలేందర్ ఇచ్చిన ట్యూన్స్ ట్రెండ్ అవ్వడం ఖాయం .  ఇక ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన జి . నాగేశ్వర్ రెడ్డి గారి చేతుల మీదుగా మా సినిమా  మోషన్ పోస్టర్ , ఫస్ట్ లుక్ విడుదల కావడం సంతోషంగా ఉంది . ఈ సందర్బంగా జి . నాగేశ్వర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు .

చిత్ర నిర్మాతలు రాయల్ చిన్నా - నాగరాజు లు మాట్లాడుతూ " రామ్ రణధీర్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాం . సినిమా రష్ చూసుకున్నాం చాలా బాగా వచ్చింది . ఈరోజుల్లో సినిమాలు ఎక్కువగా చూసేది యువతరమే కాబట్టి వాళ్లకు నచ్చే విధంగా ఈ సినిమాని రూపొందించడం జరిగింది . నాగేశ్వర్ రెడ్డి గారి చేతుల మీదుగా మా సినిమా మోషన్ పోస్టర్ ,ఫస్ట్ లుక్ రిలీజ్ కావడం మాకు మరింత సంతోషాన్ని ఇస్తోంది . పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి . త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు .

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%