సుకుమార్ తో విజయ్ దేవరకొండ?
రంగస్థలం తరువాత మహేష్ బాబుతో సినిమా చేసేందుకు సుకుమార్ ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఒక ఇంటర్వ్యూ లో మహేష్ బాబు ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. సుకుమార్ మహేష్ కోసం ఓ కథను రెడీ చేసి వినిపించాడు కూడా. తెలంగాణ రజాకార్ల ఉద్యమకారుడు కథ అది. ఈ కథను మహేష్ బాబు రిజెక్ట్ చేసినట్లు సమాచారం. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. మహేష్ కు సుకుమార్ చెప్పిన కథ విజయ్ దేవరకొండకు వినిపించినట్లు తెలుస్తోంది. కథ నచ్చిన విజయ్ సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.
మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చేస్తున్నాడు. ఆ సినిమా ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ ఈ చిత్ర షూటింగ్ జనవారికి పూర్తి చేస్తారు. మార్చి నుండి అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయబోతున్నాడు కనుక సుకుమార్ సినిమా ఉండదనే వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్, విజయ్ దేవరకొండ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతోంది. త్వరలో ఈ చిత్ర అధికారిక ప్రకటన రానుందని సమాచారం.