దీపావళికి చరణ్ సినిమా ఫస్ట్ లుక్ !
రామ్‌చరణ్ హీరోగా డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి నిర్మాణంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. వినయ విధేయ రామ అనే టైటిల్ ర్ చిత్రానికి ఫిక్స్ చేసినట్లు సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వివేక్ ఒబేరాయ్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు.
తాజా సమాచారం మేరకు ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ను దీపావళి సందర్భంగా నవంబర్7న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దసరాకు టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చినా షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు కావున వాయిదా వేశారు. బోయపాటి స్టయిల్ లో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రంగస్థలం సినిమా తరువాత చరణ్ నటించిన సినిమా కావడంతో ఈ మొవీకి బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.