Rajamouli’s RRR is set in 1930’s backdrop

1930 నేపద్యంలో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ !

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టిఆర్ హీరోలుగా ఓ మల్టీ స్టారర్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. నవంబర్ 11న ఈ సినిమాను గ్రాండ్ గా లంచ్ చెయ్యబోతున్నారు. కథను రాజమౌళిసిద్ధం చేసుకుంటుండగా సినిమాలో జూనియర్ ఎన్‌టిఆర్, రామ్‌చరణ్ తేజ్‌తో పాటు మరికొందరు చిన్న హీరోలు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. కీరవాణి ఈ చిత్రానికి సంభందించి పాటల రీరికార్డింగ్ ఎప్పుడో మొదలు పెట్టడం జరిగింది. స్వతంత్రం రాకముందు 1930 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.

ఈ సినిమాకు సంభందించి సోషల్ మీడియాలో ఎక్కువగా లీకులు అవుతున్నాయని చిత్ర యూనిట్ జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. సినిమా 11 న ప్రారంభం అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించే వరుకు ఎవ్వరికీ తెలీదు. చరణ్, ఎన్‌టి‌ఆర్ ఈ సినిమాలో చేస్తున్న పాత్రల గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నప్పటికి వాటిలో నిజం లేదని తెలుస్తోంది. సినిమా పేరు రాజమౌళి ప్రకటించే వరుకు ఈ మూవీని ఆర్.ఆర్.ఆర్ అని పిలుచుకోవాల్సిందే.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%