Young Hero Sumanth Ashwin who scored SuperHits with Anthakamundu Aa Tarwatha, Lovers, Kerintha will star in a big-budgeted film Directed by 'Dandupalyam' series Director Srinivasaraju.
M Koteswararaju who Produced Action Entertainer Garudavega under his Jyostar Enterprises banner is producing this film. This film will be made with a unique concept in the horror thriller genre. The film will be made simultaneously in Telugu, Tamil, Kannada, Malayalam languages. This biggie will start in the second week of November.
Director Srinivasraju says, " This film has a very wide span. That's why we planned this film in four languages with Sumanth Ashwin as a hero. Along with Sumanth Ashwin, there will be huge casting for other roles too. Re-Recording plays an important role in this horror thriller. So, Manisharma Garu composing the music with extra care for this film. This will become a trendsetter in Horror Thriller films. With the confidence I attained from the success of 'Dandupalyam' 1-2-3 films, I am planning this film on high technical values and big budget on a grand scale. I am very happy that tasteful Producer M Koteswararaju who delivered 'Garudavega' is producing this film. I am happy and thankful to him for giving me full freedom to make this film without any compromises. "
Executive Producer Vijay Varma says, " Pre-Production work has already begun for this film. We will start the film in November second week. We are planning to shoot this film in continuous schedules and release in all languages simultaneously."
Music- Manisharma
DOP- Shyam Prasad
Art - Veeramani
Executive Producer - Vijay Varma
Producer- M.Koteshwara Raju
Story, Screenplay & Direction - Srinivasa Raju
సుమంత్ అశ్విన్ హీరోగా ‘దండుపాళ్యం’ శ్రీనివాసరాజు దర్శకత్వంలో ‘గరుడవేగ’ నిర్మాత ఎం.కోటేశ్వరరాజు నాలుగు భాషల్లో నిర్మిస్తున్న భారీ హారర్ థ్రిల్లర్
అంతకుముందు ఆ తరువాత, లవర్స్, కేరింత వంటి సూపర్‌హిట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో సుమంత్ అశ్విన్, ‘దండుపాళ్యం’ సిరీస్ దర్శకుడు శ్రీనివాసరాజు కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రూపుదిద్దుకోనుంది. జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ‘గరుడవేగ’ వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించిన ఎం.కోటేశ్వరరాజు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో హారర్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ చిత్రీకరణ జరుపుకోనుంది. నవంబర్‌లో రెండో వారంలో ఈ భారీ చిత్రం ప్రారంభమవుతుంది.
ఈ చిత్రం గురించి దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ ‘‘చాలా స్పాన్ ఉన్న సబ్జెక్ట్. అందుకే నాలుగు భాషల్లో సుమంత్ అశ్విన్ హీరోగా ప్లాన్ చేశాం. ఇతర పాత్రల్లో భారీ తారాగణం నటిస్తారు. రీరికార్డింగ్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న హారర్ థ్రిల్లర్ ఇది. అందుకే మణిశర్మగారు ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారు. హారర్ థ్రిల్లర్స్‌లోనే ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుంది. దండుపాళ్యం 1, 2, 3 చిత్రాల విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో నేను ఈ సినిమాని చాలా పెద్ద లెవల్‌లో, చాలా హై టెక్నికల్ వేల్యూస్, భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాం. గరుడవేగ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్ ఎం.కోటేశ్వరరాజుగారు ఈ సినిమాకి నిర్మాత కావడం చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమాను చేసేందుకు నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం నాకెంతో ఆనందం కలిగిస్తోంది’’ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్‌వర్మ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్‌రెడీ స్టార్ట్ అయింది. నవంబర్ రెండో వారంలోనే సినిమా ప్రారంభమవుతుంది. కంటిన్యూగా షెడ్యూల్స్ చేసి నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేశాం’’ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ప్రసాద్, ఆర్ట్: వీరమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌వర్మ, నిర్మాత: ఎం.కోటేశ్వరరాజు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరాజు.