Social News XYZ     

RC12 first look soon, Film to release for 2019 Sankranthi

త్వ‌ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ఫ‌స్ట్ లుక్‌.. వ‌చ్చే సంక్రాంతికి భారీ విడుద‌ల‌

RC12 first look soon, Film to release for 2019 Sankranthi

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను క్రేజీ కాంబినేష‌న్‌లో భారీ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాణంగా న‌టిస్తున్నారు. 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

 

ఈ సంద‌ర్భంగా అగ్ర‌ నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ - రామ్‌చ‌ర‌ణ్‌గారు, బోయ‌పాటిగారి కాంబినేష‌న్‌లో మా బ్యాన‌ర్‌లో సినిమా చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌గానే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మాస్ ఇమేజ్ ఉన్న హీరో.. డైరెక్ట‌ర్ క‌ల‌యిక‌లో సినిమా అన‌గానే సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతూ  వ‌చ్చాయి. మెగాభిమానులు, ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను ధీటుగా సినిమాను ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నాం. సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. రెండు పాట‌లు మిన‌హా న‌వంబ‌ర్ 10 నాటికి షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. న‌వంబ‌ర్ 9 నుండే డ‌బ్బింగ్ ప్రారంభిస్తాం. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేయ‌బోతున్నాం. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి 2019 సంక్రాంతి కానుక‌గా సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుద‌ల చేస్తున్నాం అన్నారు.

Facebook Comments
RC12 first look soon, Film to release for 2019 Sankranthi

About uma