రివేంజ్ కథలో రవితేజ !
రవితేజతో మూడు సినిమాలు చేసిన శ్రీను వైట్ల, ఇప్పుడు రవితేజతో మూడు పాత్రలు వేయిస్తూ తీస్తున్న సినిమా అమర్ అక్బర్ ఆంథోనీ. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. సినిమా మొత్తం హీరో, హీరోయిన్ మధ్య జరుగుతుందని సమాచారం. చిన్న తనంలో హీరో, హీరోయిన్ కు జరిగిన అన్యాయానికి పెద్ద అయ్యాక వారు ఎలా రివెంజ్ తీసుకుంటారు అనేది సినిమా ప్రధాన కథాంశంగా తెలుస్తోంది. ఇలియాన ఈ సినిమాతో కామ్ బ్యాక్ అవ్వడం సినిమాకు ప్లస్ పాయింట్. .
రవితేజ, శ్రీను వైట్ల ఇద్దరు మైనస్ లో ఉన్నారు కావున ఈ సినిమా వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోందో చూడాలి. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. నవంబర్ 16న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆదేరోజు విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాల విడుదల కానుంది. ఈ సినిమాకు బజ్లేదు కావున రవితేజ సినిమాకే మంచి ఓపెనింగ్స్ ఉండే అవకాశం ఉంది.