Social News XYZ     

Operation 2019 movie is the political weapon of the people

ప్ర‌జ‌ల త‌ర‌పున రాజకీయ అస్ర్తం ఆప‌రేష‌న్ 2019

Operation 2019 movie is the political weapon of the people

అలివేల‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్పించు టి. అలివేలు నిర్మించిన క‌ర‌ణం బాబ్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఆప‌రేష‌న్ 2019. శ్రీ‌కాంత్‌, మంచుమ‌నోజ్ న‌టిస్తున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 

ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశ‌లో హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ...ఈ క‌థ పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ప్ర‌త్యేకించి ఏ పార్టీని బేస్ చేసుకుని కాదు. ఎల‌క్ష‌న్స్ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల్లో ఎవేర్‌నెస్ పెంచ‌డం కోసం చేసిన మూవీ. ఒక సామాన్య వ్య‌క్తి పొలిటీషియ‌న్ అయితే అత‌ను ఎద్దుర్కొనే ప‌రిణామాలు ఎలా ఉంటాయి. ఏవిధంగా ప్ర‌జ‌లు అటు పొలిటీషిన్స్ చేసే పొర‌పాట్ల గురించి ఉంటుంది క‌థ‌. ఇందులో నేను ప‌క్కా పొలిటీషియ‌న్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తాను. ప్ర‌స్తుతం ఎలాగో ఎల‌క్ష‌న్స్ వ‌స్తున్నాయి కాబట్టి ఈ స‌బ్జెక్ట్‌ని ప్లాన్ చేశాము. అటు పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌ని, ఇటు ప్ర‌జ‌ల్ని ఇద్ద‌ర్నీ టార్గెట్ చేసి చేసిన మూవీ ఇది. ప్ర‌త్యేకించి ఇది ఏ పార్ట‌పార్టీకి సంబంధం ఉండ‌దు. కాని కొన్ని కొన్ని సీన్స్ మాత్రం క‌నెక్ట్ అవుతుంది. గ‌తంలో వ‌చ్చిన ఆప‌రేష‌న్ దుర్యోధ‌న మూవీకి దీనికి సీక్వెల్ కాదు కాని కొన్ని సీన్స్ అలాగ అనిపిస్తాయి. ఈ డైరెక్ట‌ర్‌తో గ‌తంలో నేను మెంట‌ల్ అనే చిత్రం చేశాను. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల అది ఆగిపోవ‌డం జ‌రిగింది. మ‌ళ్ళీ ఈ చిత్రం ఆప‌రేష‌న్ 2019తో మీ ముందుకు వ‌స్తున్నాం. ఈయ‌న‌కు సినిమా త‌ప్ప వేరే ప్ర‌పంచం లేదు. సినిమా అంటే చాలా ప్యాష‌న్‌.

ప్రొడ్యూస‌ర్ కూడా చాలా మంచివారు సినిమాకి ఏం కావాల‌న్నా అన్నీ స‌మ‌కూర్చారు. మొన్న‌నే క‌న్న‌డ‌లో ఒక సినిమా చేశాను అందులో నెగిటివ్ క్యారెక్ట‌ర్‌లో చేశాను. అక్క‌డ ఆ చిత్రం సూప‌ర్ హిట్ అయింది. మ‌ల‌యాళంలో కూడా ఒక సినిమా చేశాను. తెలుగులో మార్ష‌ల్ అనే ఒక చిత్రం చేస్తున్నాను షూటింగ్ అవుతుంది. ఆ చిత్రానికి జ‌య‌రాజ్‌గారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మ‌నోజ్ కూడా న‌టించారు. చాలా డెడికేటెడ్ ప‌ర్స‌న్‌. మా బాబు యాక్టింగ్ కోర్స్ అయిపోయింది. వ‌చ్చే ఏడాదిలో తీసుకొద్దాం అనుకుంటున్నాను. మంచి క‌థ‌లను బ‌ట్టి ముంద‌డుగు వేస్తాను. ఇంకా ఎవ‌రు లాంచ్ చెయ్యాలి ఏంటి అని ప్ర‌త్యేకించి ఏమీ అనుకోలేదు. ఈ సినిమాకి ఓపెన్సింగ్స్ రాగ‌లిగితే ఆడియ‌న్స్ ఆద‌రిస్తారు. ఆప‌రేష‌న్ దుర్యోధ‌న అలానే అయింది ఓపెనింగ్స్ బావుండ‌డంతో సినిమా ఎక్క‌డికో వెళ్ళిపోయింది.

ఈ చిత్రంలోని డైలాగ్స్ చాలా నార్మ్‌గా ఉంటాయి నేచ‌ర‌ల్ పొలిటీష‌న్ డైలాగ్స్ లాగానే ఉంటాయి. షూటింగ్ మొత్తం అమెరికాలో చేశాం. ఎన్ ఆర్ ఐ పొలిటీషియ‌న్‌గా మారితే ఎలా అన్న‌ది అంటే అలా అని భ‌ర‌త్ అను నేను టైపులో ఉండ‌దు. నేను ఇంకా తెలంగాణ దేవుడు అని సినిమా చేస్తున్నాను. కేసీఆర్ బ‌యోపిక్ అన్న‌ట్లు ఆయ‌న చిన్న‌ప్ప‌టి నుంచి తీసుకుని జీవిత చ‌రిత్ర చేస్తున్నాను. ఆ చిత్రానికి హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో ఉద్య‌మానికి సంబంధించిన పాట‌లు ఎక్కువ‌గా ఉంటాయి. కోత‌ల రాయుడు అన్న చిత్రం కూడా చేస్తున్నాను. పొలిటిక‌ల్ స్టోరీలు వ‌స్తున్నాయి కాబ‌ట్టి స‌బ్జెక్ట్ న‌చ్చి సినిమాలు చేస్తున్నాను త‌ప్ప నాకు ప్ర‌త్యేకించి పాలిటిక్స్‌లోకి రావాల‌ని చేయ‌డం లేదు. నాకెరియ‌ర్‌ని స‌క్సెస్‌లో ఉండి ఉంటే ప‌క్కాగా ప్లాన్ చేసుకునేవాడ్ని కాని స‌క్సెస్ లేన‌ప్పుడు వ‌చ్చిన‌వ‌న్నీ జాగ్ర‌త్త‌గా చూసుకుని ఒక న‌టుడిగా చేసుకుంటూ వెళ్ళ‌డ‌మే. ప్ర‌స్తుతం డిఫ‌రెంట్ స్టోరీస్ అన్నీ చేసుకుంటూ వెళుతున్నాను నేను జ‌గ‌ప‌తిబాబుగారిలాగా విల‌న్ క్యారెక్ట‌ర్స్ చెయ్య‌డానికి కూడా సిద్ధ‌మ అని ముగించారు.

ఇంకా ఈ చిత్రంలో సునీల్‌, య‌జ్ఞ‌శెట్టి, దీక్షాపంత్‌, హ‌రిత‌, స‌లోని, సుమ‌న్‌, కోటాశ్రీ‌నివాస‌రావు, నెక్కంటి వంశీ, వినీత్‌కుమార్‌, పోసానికృష్ణ‌ముర‌ళి, జీవ‌, రామ‌రాజు, శివ‌కృష్ణ‌, రామ్‌జ‌గ‌న్‌, స‌మీర్ న‌వీన్‌, ఆర్‌.పి(జ‌బ‌ర్‌ద‌స్త్‌) త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ః ర్యాప్‌రాక్ ష‌కీల‌, ప్రొడ్యూస‌ర్ః టి.అలివేలు, రైట‌ర్‌మ‌రియు డైరెక్ట‌ర్ః క‌ర‌ణం బాబ్జీ, డి.ఓ.పి.వెంక‌ట్‌ప్ర‌సాద్, ఎడిట‌ర్ఃఎస్‌.బి. ఉద్ధ‌వ్‌,

Facebook Comments
Operation 2019 movie is the political weapon of the people

About uma