Social News XYZ     

Ajay playing the main lead in “Special” – The Story of a Mind Reader

అజయ్ ముఖ్యపాత్రలో "స్పెషల్" - ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్

Ajay playing the main lead in "Special" - The Story of a Mind Reader

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటుడు అజయ్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడులో ప్రతి నాయకుడిగా నటించి అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకొని, పలు చిత్రాల్లో హీరోగా, విలన్ గా, సహాయ నటుడిగా నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు అజయ్. ఇక ఇప్పుడు ఓ అద్భుతమైన స్టోరీ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిస్తున్న స్పెషల్ చిత్రంలో ముఖ్య భూమిక పోషించారు. ఇది ఒక మైండ్ రీడర్ లవ్ రివెంజ్ స్టోరీ. ఇందులో అజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. నందలాల్ క్రియేషన్స్ పతాకంపై నందమ్ శ్రీవాస్తవ్ నిర్మాతగా, వాస్తవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈనెల 29న చిత్ర టీజర్ ను విడుదల చేయనున్నారు. నవంబర్ చివరి వారంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వాస్తవ్ మాట్లాడుతూ.... స్పెషల్... ఒక మైండ్ రీడర్ స్టోరీ. ఓ వ్యక్తిని ఒకమ్మాయి లవ్ చేసి వదిలేస్తుంది. చీట్ చేస్తుంది. ఆ అమ్మాయి అలా అతన్ని చీట్ చేయడానికి కారణమైన వాళ్లమీద ఈ మైండ్ రీడర్ రివెంజ్ తీర్చుకుంటాడు. మనుషుల్ని టచ్ చేసి వాళ్ల మైండ్ రీడ్ చేసే ఒక పారా సైకాలజీ స్కిల్ నేపథ్యంలో సాగుతుంది. హాలీవుడ్ తరహా కథాంశంతో తీసిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ ఇది. ఈ స్పెషల్ చిత్రంలో అజయ్ పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా నటించారు. గజిని, పిజ్జా, సెవెన్త్ సెన్స్, కాంచన, అపరిచితుడు, హాలీవుడ్ లో వచ్చిన సిక్స్త్ సెన్స్, మెకనిస్ట్, అన్ బ్రేకబుల్, సైకో వంటి మూవీస్ ని తలపించే స్టాండర్ట్స్ లో టేకింగ్ పరంగా ఈ మూవీ ఉంటుంది. అని అన్నారు.

చిత్ర నిర్మాత మాట్లాడుతూ.... మా బ్యానర్లో తెరకెక్కిస్తున్న స్పెషల్ చిత్రం...నిజంగానే స్పెషల్ సినిమాగా ఉంటుంది. ఇది ఫాంటసీ లవ్ యాక్షన్ షేడ్స్ తో నడుస్తుంది. చిత్ర కథ, కథనం, ట్విస్టులు ఈ చిత్రానికి ప్రధాన బలం. ఈ చిత్రంలోని డైలాగ్స్ ఇంతవరకు తెలుగులో చూడని కొత్త ఫీలింగ్ ని ఆడియెన్స్ కి ఇస్తుంది. అజయ్ అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ గా ఉంటుంది. మైండ్ రీడర్ నేపథ్యంలో సాగే కథ, కథనం అబ్బురపరుస్తుంది. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తయింది. మా దర్శకుడి విజన్ కి తగ్గట్టుగా అద్భుతంగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 29న చిత్ర టీజర్ ను విడుదల చేస్తున్నాం. నవంబర్ చివరి వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అని అన్నారు.

నటీనటులు
అజయ్, రంగ, అక్షత, సంతోష, అశోక్ కుమార్, బిహెచ్ఈఎల్ ప్రసాద్, జబర్దస్త్ అప్పారావ్, ప్రకాష్, మహేష్, చక్రపాణి, కమలేష్, వర్షిత్, బిహెచ్ఈఎల్ సునీల్, గౌతమ్ తదితరులు

సాంకేతిక వర్గం

బ్యానర్ - నందలాల్ క్రియేషన్స్
నిర్మాత - నందమ్ శ్రీ వాస్తవ్
డైరెక్టర్ - వాస్తవ్
మ్యూజిక్ డైరెక్టర్ - ఎన్వీఎస్ మన్యం
ఫొటోగ్రఫీ - బి అమర్ కుమార్
ఎడిటింగ్ - ఎస్ బి ఉద్దవ్
ప్రొడక్షన్ కంట్రోలర్ - బిఎస్ నాగిరెడ్డి
కో డైరెక్టర్ - ప్రణీత్ వర్మ
సౌండ్ రికార్డింగ్ - సాగర్ స్టూడియోస్
సిజి అండ్ డీఐ - క్రిష్ణ ప్రసాద్
పిఆర్ఓ - ఏలూరు శ్రీను

Facebook Comments
Ajay playing the main lead in "Special" - The Story of a Mind Reader

About uma