"బంగారి బాలరాజు" సినిమా తప్పకుండా చూస్తాను ... కె. వి.రమణాచారి ( తెలంగాణ ప్రభుత్వ సలహాదారు)
పరువు హత్యల నేపథ్యం లో వస్తున్న రాయలసీమ ఫ్యాక్షన్ ప్రేమకథ "బంగారి బాలరాజు". ఈ చిత్రం ఈనెల 25న విడుదల సందర్భంగా తెలంగాణ ముఖ్య సలహాదారు కె.వి.రమణాచారి గారిని "బంగారి బాలరాజు" చిత్ర యూనిట్ ఆయన నివాసంలో కలసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా రమణాచారి గారు మాట్లాడుతూ...."బంగారి బాలరాజు" చిన్న చిత్రం అయినా పెద్ద చిత్రం అంత పబ్లిసిటి ప్రొడ్యూసర్స్ కె.యం.డి. రఫి, రెడ్డం రాఘవేంద్రరెడ్డి చేశారు. ఈ చిత్రం పైన వాళ్ళకి ఉన్న నమ్మకం నిజమై వాళ్ళ టీమ్ కి మంచి విజయం రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో “అనిత ఓ అనిత” వీడియో పాటని చూశానని, సోషల్ మీడియా అంతగా అందుబాటు లేని రోజుల్లోనే కోటేoద్ర దుద్యాల తన అనిత ఓ అనిత వీడియో సాంగ్ ని సంచలనం చేసారు. ఈ బంగారి బాలరాజు కూడా సంచలనం అయి డైరెక్టర్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు రావాలి. ఇంకా మరెన్నో మంచి చిత్రాలు తీయాలి అని కోరుకుంటున్నానని అన్నారు.
ఈ చిత్రంలోని హీరోయిన్ కరోణ్య కత్రిన్ ని మూడు సంవత్సరాల క్రితం తిరుపతిలో చూసి నీకు మంచి భవిష్యత్తు ఉంది అని ఆరోజు దీవించడం జరిగింది అది గుర్తు పెట్టుకుని వాళ్ళ అమ్మగారు చిత్ర యూనిట్ తో సహా వచ్చి బంగారి బాలరాజు చిత్రంలో కరోణ్య కత్రిన్ హీరోయిన్ గా చేసింది అని మూవీ టీజర్స్ చూపించారు. పరువు హత్యల నేపథ్యం లో వస్తున్న రాయలసీమ ఫ్యాక్షన్ ప్రేమకథ చాలా బాగా చేశారు "బంగారి బాలరాజు' చిత్రాన్ని వీలు చూసుకొని తప్పకుండా చూస్తాను అని చెప్పారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... “ఈ రోజు కె.వి.రమణాచారి గారిని కలవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని, ఆయన బిజీ షెడ్యూల్ లో కూడా మాకు టైమ్ ఇచ్చి టీజర్స్ వీడియో సాంగ్స్ చూసి మరోసారి టైమ్ చూసుకొని మా "బంగారి బాలరాజు" చిత్రాన్ని చూస్తానని అనడం మా చిత్ర యూనిట్ కి మరింత ఆనందాన్ని కలిగించింది. ఆయనకు మా చిత్ర యూనిట్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము” అని తెలియజేశారు.
చిత్ర హీరో రాఘవ్ మాట్లాడుతూ .. పెద్దలు గురువర్యులు కె.వి.రమణాచారి గారిని కలవడం ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనకు నా పాదాభివందనం తెలుపుకుంటున్నాను అని అన్నారు.
ఈ చిత్ర హీరోయిన్ కరోణ్య కత్రిన్ మాట్లాడుతూ...రమణాచారిగారిని మళ్ళీ ఇలా హీరోయిన్ అయ్యాక కలవడం చాలా సంతోషంగా ఉందని, నేను మూడు సంవత్సరాలు క్రితం తిరుపతిలో ఒక డాన్స్ కాంపిటిషన్ లో ఆయన చేతుల మీదుగా విన్నింగ్ షీల్డ్ తీసుకున్నానని, అప్పుడు సార్ నన్ను పిలిచి నీకు మంచి భవిష్యత్తు ఉంది అని ఆరోజు దీవించడం జరిగిందని అన్నారు. ఆ రోజు మంచి మనసుతో దీవించడం, ఈ రోజు నాలుగు సినిమాల హీరోయిన్ గా అయి ఆయన ముందుకు నా మొదటి సినిమా "బంగారి బాలరాజు" మూవీ విడుదల ముందు కలవడం ఆయన ఆశీస్సులు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ, మీకు మా ఫ్యామిలీ మొత్తం మా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాము సార్ అని తన ఆనందాన్ని తెలిపారు.