Tarak to become Yama Donga again?

మరోసారి యమదొంగగా ఎన్‌టి‌ఆర్!

రాజమౌళి తరుపరి సినిమా ఎన్‌టి‌ఆర్ చరణ్ తో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. సినిమా అధికభాగం షూటింగ్ హైదారాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన ఒక సెట్ లో జరగబోతోంది. నవంబర్ నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఎన్‌టి‌ఆర్ ఒక దొంగ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. గతంలో ఎన్‌టి‌ఆర్ ను యమదొంగగా చూపించిన రాజమౌళి మరోసారి ఎన్‌టి‌ఆర్ ను అదే తరహా పాత్రలో చూపించబోతున్నట్లు సమాచారం. చరణ్ చేయబోయే రోల్ గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

చరణ్ ప్రస్తుతం బోయపాటి చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరో రెండు వారాల్లో చరణ్, బోయపాటి మూవీ షూటింగ్ పూర్తి కానుంది. తరువాత ఎన్‌టి‌ఆర్, చరణ్ ఇద్దరు ఒకేసారి ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. కీరవాణి ఈ సినిమా కోసం మ్యూజిక్ వర్క్స్ స్టార్ట్ చేసినట్లు సమాచారం.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%