‘బైలంపుడి’ పోస్టర్ లాంచ్!!
తార క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘బైలంపుడి’. హరీష్ వినయ్, అనుష్క తివారి జంటగా నటిస్తోన్న ఈ చిత్రం ద్వారా అనిల్ పి .జి .రాజ్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం వైజాగ్ దగ్గర చోడవరంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గురువారం ఫిలించాంబర్‌లో ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్మాత బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ...‘‘పారిశ్రామికవేత్తగా ఉన్న నేను సినిమా మీద ఆసిక్తతో తొలిసారిగా నిర్మాతగా ‘బైలంపుడి’ చిత్రాన్ని నిర్మిస్తున్నా. ఒక మంచి సినిమా నిర్మించాలన్న కల ఈ సినిమాతో నెరవేరుతోంది. బైలంపుడి అనే గ్రామంలో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రివేంజ్ డ్రామా ఇది. ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ఎక్కడా వల్గారిటీ అనేది కనిపించదు. చోడవరం లో షూటింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు 30 పర్సంట్ షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో కథా బలంతో వస్తోన్న చిత్రాలను ఆదరిస్తున్నారు. అలా ఓ వినూత్నమైన కథతో దాదాపు అంతా కొత్తవారితో తెరకెక్కుతోన్న మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మిస్ ఫేమ్ ఇండియా 2018 షాలు సోని మాట్లాడుతూ...‘‘బ్రహ్మానంద రెడ్డిగారు ఒక మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ చాలా బావుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ ``అన్నారు.
‘బైలంపుడి’ చిత్ర ప్రమోటర్ శ్రీనివాస్ శరకడం మాట్లాడుతూ...‘‘ఇందులో జానపద నృత్యంతో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ త్వరలో విడుద చేయబోతున్నాం. ఆ సాంగ్‌కు ఎవరైనా వారి శైలిలో డాన్స్ చేసి పంపిస్తే వారికి నగదు బహుమతితో పాటు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వారితో పర్ఫార్మ్ కూడా చేయిస్తాం. రెండు రాష్ట్రాల్లో డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఈ చిత్రంలో నిర్మాత బ్రహ్మానంద రెడ్డిగారు మెయిన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. జనవరిలో సినిమాను విడుద లచేయాలన్న ఆలోచనలో ఉన్నాం’’అన్నారు.
డైలాగ్ రైటర్ సాయి మాట్లాడుతూ...‘‘బైలంపుడి’ అనే గ్రామం నిజంగానే ఉంది. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఈ సిని మా చేశాం. సినిమా చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. పలు చిత్రాలకు కెమెరామేన్‌గా పని చేసిన అనిల్ గారు ఈ సినిమా డైరక్షన్ చేస్తున్నారు’’ అన్నారు.
హరీష్ వినయ్, తనిష్క తివారి, బ్రహ్మానంద రెడ్డి, సుచిత్ర, గణి, గోవింద్, నటరాజ్, నారే, సెబాస్టియన్, మహేంద్రనాథ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, సినిమాటోగ్రాఫర్: అనిల్ కుమార్ పళ్ల, స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ అండ్ డైలాగ్స్: సాయి, ఎడిటర్: జానకిరామ్, ఫైట్స్: కృష్ణం రాజ్, ఆర్ట్: ఉత్తమ్‌కుమార్ సురిశెట్టి, డాన్స్: ఘోరా, లిరిక్స్: రామారావు, పిఆర్వో: వంగా కుమారస్వామి, నిర్మాత: బ్రహ్మానందరెడ్డి, స్టోరి-స్క్రీన్‌ప్లే-డైరక్షన్: అనిల్ పి.జి.రాజ్
This website uses cookies.