ముళ్లగూరు అనంతరాముడు అంచలంచెలుగా అగ్ర నిర్మాత కావాలి!
-'టు ఫ్రెండ్స్' ప్రి రిలీజ్ వేడుకలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్
ఆనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై.. ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో.. ముళ్లగూరు ఆనంతరాముడు-ముళ్లగూరు రమేష్ నాయుడు తెలుగు-కన్నడ భాషల్లో సంయుక్తంగా నిర్మించిన సినిమా 'టు ఫ్రెండ్స్'. 'ట్రూ లవ్' అనేది ట్యాగ్ లైన్. సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా, ఫర హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకుడు.
ఈనెల 26న విడుదలవుతున్నఈ చిత్రం ముందస్తు విడుదల వేడుక (ప్రీ రిలీజ్ ఈవెంట్) ను హైద్రాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్, ప్రముఖ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సి.కళ్యాణ్, ప్రముఖ ఫైనాన్సియర్ నారపురెడ్డి, ప్రముఖ నటి కవిత, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వీరినాయుడు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సి ఐ ఎస్ ఎఫ్) హరిప్రసాద్ రాజులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తన తొలి చిత్రం (టు ఫ్రెండ్స్) నిర్మాణంలో తనకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని, అయితే సినిమా చాలా బాగా రావడం వల్ల వాటిని అనుభవ పాఠాలుగా తీసుకొని, వదిలేశానని, భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తానని చిత్ర నిర్మాత ముళ్లగూరు అనంతరాముడు తెలిపారు. అయితే కొత్తగా సినిమాలు తీసేవాళ్ళు మాత్రం... ముందుగా అన్నీ తెలుసుకొని సినిమా నిర్మాణ రంగంలో అడుగు పెట్టాలని ఆయన హితవు పలికారు. తెలుగుతోపాటు కన్నడలోనూ రూపొందిన ఈ చిత్రాన్ని ఇప్పటికే కన్నడలో విడుదల చేశామని, అక్కడ మంచి వసూళ్లు సాధించడం తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. హీరో శ్రీకాంత్ ఈ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పేరు. అన్ని రంగాల్లో అసాధారణ విజయాలు సాధిస్తున్న అనంత రాముడు సినిమా రంగంలోనూ అద్భుతాలు ఆవిష్కరించాలని అంబికా కృష్ణ ఆకాంక్షించారు. ట్రూ లవ్' అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన 'టు ఫ్రెండ్స్' ట్రూ సక్సెస్ సాధించాలని అభిలషించారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ చిత్ర కథానాయకుడు కార్తీక్ కోసం ఈ వేడుకకు వచ్చానని, హీరోగా అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. రైతు కుటుంబం నుంచి సినిమా రంగంలోకి వచ్చిన అనంతరాముడు అంచలంచెలుగా అగ్ర నిర్మాత కావాలని శ్రీకాంత్ అభిలషించారు. తాను నిర్మాత కావడానికి కారకులయిన ప్రముఖ ఫైనాన్సియర్ నారపురెడ్డి మిత్రులు ముళ్లగూరు ఆనంతరాముడుగారు నిర్మాతగా శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకత్వంలో రూపొందిన 'టు ఫ్రెండ్స్' ఘన విజయం సాధించాలని సి.కళ్యాణ్ కోరుకున్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. 'ఆనంతరాముడుగారు వంటి గట్స్ ఉన్న నిర్మాతల అవసరం ఇండస్ట్రీకి ఉందన్నారు. ఈ సినిమా చూశానని, దర్శకుడు శ్రీనివాస్ సినిమాను అద్భుతంగా తీర్చి దిద్దారని.. 'టు ఫ్రెండ్స్' చిత్రాన్ని రెండు రాష్ట్రాల్లో 150కి పైగా ధియేటర్స్ లో ఈనెల 26న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ జి.ఎల్.బి మాట్లాడుతూ.. "ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు అందించిన సహాయ సహకారాల వల్ల సినిమా చాలా బాగా వచ్చింది" అన్నారు.
ఈ సందర్భంగా అంబికా కృష్ణను 'టు ఫ్రెండ్స్' చిత్ర బృందం ఘనంగా సత్కరించింది. అతిదులందరికీ చిరు జ్ఞాపికలు బహూకరించింది.
ఇంకా ఈ కార్యక్రమంలో ఈ చిత్రానికి కథ, మాటలు, సంగీతం సమకూర్చిన పోలూర్ ఘటికాచలం, హీరో అఖిల్ కార్తీక్, సినిమాటోగ్రాఫర్ సురేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధనరాజ్, స్నిగ్ధ, సమీర్ దత్త, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, సాయిప్రకాష్, సాధు కోకిల, కవిత, రమేష్ భట్, డి.వై.రఘురాం, చిత్ర శెనాయి, శ్రీలక్ష్మి, కృష్ణవేణి, వై.విజయ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పాటలు: చిర్రావూరి విజయ్ కుమార్-వరికుప్పల యాదగిరి-డి.వై.రఘురాం, కొరియోగ్రఫీ: స్వర్ణబాబు, కో-డైరెక్టర్: నాగుల జగన్నాధ్, పీఆర్వో: ధీరజ అప్పాజీ, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, కథ-మాటలు-సంగీతం: పోలూర్ ఘటికాచలం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ముళ్ళగూరు వెంకటేష్ నాయుడు, నిర్మాతలు: ముళ్ళగూరు అనంతరాముడు-ముళ్ళగూరు రమేష్ నాయుడు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ జి.ఎల్.బి