దర్శక నిర్మాతలతో సుధీర్ బాబు కోల్డ్ వార్ !
నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రీయ కాంబినేషన్ లో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం వీర భోగ వసంత రాయలు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఇంద్రసేన తెరకెక్కించారు. బాబా క్రియేషన్స్ పతాకంపై అప్పారావు బెల్లానా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
ట్రైలర్ లో సుధీర్ బాబు వాయిస్ కు మరెవరో డబ్బింగ్ చెప్పారు. ఈ విషయం గురించి సుధీర్ బాబు ట్విటర్ లో ''ట్రైలర్ లో నా వాయిస్ ఇవ్వలేకపోయాను. అందుకు కారణం ఇక్కడ చెప్పలేను'' అని ట్వీట్ చేశాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సుధీర్ బాబు చిత్ర దర్శక నిర్మాతలతో వాగ్వాదానికి దిగాడని. సినిమా జనాలు కూడా చర్చించుకుంటున్నారు, సుధీర్ బాబుకు వీరబోగ వసంతరాయలు చిత్ర యూనిట్ కు మధ్య విభేధాలు తలెత్తాయని. ఈ విషయం గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అక్టోబర్ మొదటివారంలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.