Hyderabad, 16th Oct 2018: Kobbarillu Multi Cuisine is theme based Restaurant launching in Srinagar Colony. The Uniqueness of Kobbarillu is going to be passionate Ambience which will strike a chord with all the young crowd, plush Greenery created within the Restaurant for presenting a wonderful experience to the customers. We promise to give a pleasant and heart touching Fine Dining Experience to all our customers. Kobbarillu is a Multi Cuisine Restaurant serving authentic North Indian, South Indian, Hyderabadi, Chinese, Thai and Continental cuisines. The Chefs have been hired from several parts of India and Nepal to bring the authenticity in the taste. The tremendous amount of planning and Research has been made in choosing the Menu, Crockery, Cutlery, Plush Interiors and we promise to provide an experience which our customers will cherish.
With a seating capacity of 114, Kobbarillu Multi Cuisine is located right in the heart of the Hyderabad's. Located at Srinagar Colony, with Ample parking, we are happy to launch our Restaurant V.V. Vinayak.
శ్రీనగర్ కాలనీ లో ... వి వి వినాయక చేతుల మీదుగా...
కొబ్బరిల్లు మల్టి క్యుజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ గొప్ప ప్రారంభం
హైదరాబాద్, అక్టోబరు 16, 2018: అద్భుతమైన థీమ్ ఆధారిత కొబ్బరిల్లు రెస్టారెంట్ శ్రీనగర్ కాలనీ లో హెరిటేజ్ ఫ్రెష్ ఎదురుగ కొలువుదీరింది. ఈ రెస్టారెంట్‌కి ఎన్నో వినూత్న, విశేషాలు ఉన్నాయి. యువతను ఆకట్టుకునే విభిన్న రకాల అంశాలు, పరిసరాలు దీనికి కొత్త శోభను ఇస్తున్నాయి. రెస్టారెంట్ ప్రాంగణంలో పరచుకున్న పచ్చదనం ఆహ్లాదకరమైన అనుభూతిని అతిధులకు అందిస్తుంది. అత్యంత ఆనందదాయకమైన, హృదయాన్ని స్పర్శించే రుచుల ఆస్వాదనను అందిస్తామని కొబ్బరిల్లు నిర్వాహకులు తమ అతిధులకు హామీ ఇస్తున్నారు.
రుచులెన్నో...
థీమ్, యాంబియన్స్‌లో మాత్రమే కాకుండా కొబ్బరిల్లు రెస్టారెంట్ విభిన్న రకాల రుచులను వడ్డించడంలోనూ అతిధుల అభి‘రుచుల’కు పెద్ద పీట వేస్తోంది. ఉత్తరాది, దక్షిణాది ప్రాంతీయ రుచులతో పాటు ప్రత్యేకంగా పేరొందిన హైదరాబాదీ క్యుజిన్ అంతేకాకుండా చైనీస్, థాయ్, కాంటినెంటల్ క్యుజిన్లను కూడా అందిస్తోంది. ఆయా ప్రాంతాలకు చెందిన అసలు సిసలు రుచులను వండి వడ్డించేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా నేపాల్ నుంచి కూడా చెఫ్స్ ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఎన్నో పరిశోధనల అనంతరం, ఎంతో ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దిన, ఎంపిక చేసిన రుచుల మెనూ, క్రొకరీ, కట్లరీ, ఇంటీరియర్స్‌తో నిర్వాహకులు అతిధుల ఆనందానికి పూర్తిగా హామీ ఇస్తున్నారు. 114 సీటింగ్ సామర్ధ్యంతో కొబ్బరిల్లు రెస్టారెంట్ నెలకొంది. శ్రీనగర్ కాలనీ లో హెరిటేజ్ ఫ్రెష్ ఎదురుగ పూర్తి స్థాయి పార్కింగ్తో ఉన్న ఈ అద్భుతమైన రెస్టారెంట్‌ను వి వి వినాయక చేతుల మీదుగా ప్రారంభించారు.
కొబ్బరిల్లు రెస్టారెంట్ ప్రారంభ సందర్భంగా వి వి వినాయక మాట్లాడుతూ ‘‘ఈ కొబ్బరిల్లు మల్టిక్యుజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఈ రెస్టారెంట్ థీమ్, అందమైన పరిసరాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. తమ కస్టమర్ల మనస్సులను ఈ కొబ్బరిల్లు తప్పకుండా ఆకట్టుకుంటుందని, నాణ్యమైన, రుచికరమైన ఫుడ్‌తో ఆదరణ పొందుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ రెస్టారెంట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.
ఈ సందర్భంగా మేనేజింగ్ పార్ట్నర్స్ వీరంకి క్రాంతి కుమార్, బొద్దు గంగాధర్, గోపి శ్రీనివాస్ మరియు మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘వినూత్న ఆలోచనలతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన మాకు ఇది కల సాకారం కావడం లాంటిది. మా రెస్టారెంట్‌కి వచ్చిన కస్టమర్లు అందరికీ ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తామని మేం హామీ ఇస్తున్నాం. నగర్ వాసులకు ఈ థీమ్ బాగా నచ్చుతుందని మా నమ్మకం. ప్రతి టేబుల్ మీదా వారికి నచ్చే వంటకాలను అందించగలమని నమ్ముతున్నాం’’అని అన్నారు.
This website uses cookies.