కోటి రూపాయలు డిమాండ్ చేసిన అనిరుద్ !
ఈ ఏడాది ఆరంభంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాకు సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అజ్ఞాతవాసి చిత్రం విజయం సాధించకపోవడంతో వెంటనే తెలుగు సినిమాలు ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు రాలేదు.
కొంతకాలం తరువాత నాని చేయబోతున్న జెర్సీ సినిమాకు సైన్ చేసాడు అనిరుద్. ఈ సినిమా కోసం 1 కోటి రూపాయలు డిమాండ్ చేసాడట అనిరుద్, అయితే నిర్మాతలు అంత అమౌంట్ అవ్వడానికి అంగీకరించకపోవడకతో చివరికి 70 లక్షలకు సినిమాను చెయ్యడానికి ఒప్పుకున్నాడు అనిరుద్. ఈ నెల 18 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో నాని మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. మళ్ళిరావా సినిమాతో విజయం సాధించిన గౌతమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.