Hello Guru Prema Kosame movie is a heart touching entertainer: Dil Raju

హృద‌యాన్ని హ‌త్తుకునే ఎమోష‌న్స్‌.. హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో తెర‌కెక్కిన ` హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` అంద‌రినీ మెప్పిస్తుంది - హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ హ‌లో గురు ప్రేమ కోస‌మే. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్న శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌ణీత హీరోయిన్స్‌గా న‌టించారు. ఈ సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ క్యూట్ అండ్ సెన్సిబుల్ ల‌వ్ స్టోరీకి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌ను శ‌నివారం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో...

సినిమాని ప్రేమిస్తారు
ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ మాట్లాడుతూ - నేను, దిల్‌రాజుగారు క‌లిసి మ‌ళ్లీ సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుండో అనుకుంటుంటే ఇప్ప‌టికి కుదిరింది. ఇద్ద‌రం విన‌గానే ఈ స్క్రిప్ట్‌కి క‌నెక్ట్ అయ్యాం. ఈ క‌థ విన్న‌వాళ్లంద‌రూ.. ఒకే ఒక పాయింట్‌కి క‌నెక్ట్ అయ్యారు. సినిమా మెయిన్ పాయింటే అది. సినిమా చూసిన త‌ర్వాత అంద‌రూ దానికే క‌నెక్ట్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. రాజుగారి స్క్రిప్ట్ జ‌డ్జ్‌మెంట్ గురించి నేను చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న లైఫ్‌లో ల‌వ్‌స్టోరీస్ ఉన్నాయో లేదో కానీ ప్ర‌తి సినిమాను ఎంత‌గానో ప్రేమించేస్తారు. త్రినాథ‌రావుతో ప‌నిచేయ‌డం చాలా క‌ష్టం. ఎందుకంటే త్రినాథ‌రావు గారు ముందు ఆడియెన్ త‌ర్వాతే డైరెక్ట‌ర్‌. యాక్టింగ్ చేస్తుంటే న‌వ్వేస్తుంటారు. రైట‌ర్ ప్ర‌స‌న్న‌కుమార్.. కామెడీ సీన్స్‌తో పాటు, ఎమోష‌న‌ల్ సీన్స్‌ను కూడా చాలా బాగా రాశాడు. అలాగే సాయికృష్ణ‌గారికి థాంక్స్‌. దేవిశ్రీప్ర‌సాద్‌తో నేను చేసిన ఆరో సినిమా. సినిమా ఎలా ఉన్న మా కాంబినేష‌న్‌లో అన్ని సినిమా పాట‌లు చార్ట్ బ‌స్ట‌ర్స్ అయ్యాయి. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే.. దేవిశ్రీ ప్ర‌సాద్ యు.ఎస్‌లో షోస్ చేస్తున్నా కూడా ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశాడు. చంద్ర‌బోస్‌గారు,  శ్రీమ‌ణిగారు చాలా మంచి సాహిత్యాన్ని అందించారు. ప్ర‌కాశ్‌రాజుగారితో ప‌నిచేయ‌డం గౌర‌వంగా ఉంటుంది. ఆయ‌న‌తో ప‌నిచేస్తే న‌టులుగా మేం మ‌మ్మ‌ల్ని త‌రచి చూసుకోగ‌లుతాం. విజ‌య్‌గారు అద్భుతంగా తెర‌కెక్కించారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో రెండో సినిమా ఇది. ఫైనెస్ట్ పెర్ఫార్మ‌ర్‌. శిరీష్‌గారు, ల‌క్ష్మ‌ణ్‌గారికి థాంక్స్‌. అక్టోబ‌ర్ 18న సినిమా విడుద‌ల‌వుతుంది అన్నారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - మ‌న లైఫ్‌లో మ‌నం చాలా చూస్తుంటాం. గెలిచిన వాళ్లు ఓడిపోతుంటారు.. మ‌ళ్లీ గెలుస్తారు. స్పోర్ట్స్ ప‌ర్స‌న్స్‌కి స‌క్సెస్‌, ఫెయిల్యూర్ అనేది కామ‌న్‌. ఓ ఎలక్ష‌న్స్ గెల‌వ‌డం, ఓడిపోవ‌డం.. మ‌ళ్లీ గెల‌వ‌డం అనేది పొలిటీషియ‌న్స్‌కి కామ‌న్‌. అలాగే మా సినిమా వాళ్ల విష‌యానికి వ‌స్తే స‌క్సెస్‌లు, ఫెయిల్యూర్స్ వ‌చ్చినా కూడా సినిమా తీయాల‌నే ప్యాష‌న్‌తో ఇక్క‌డే ఉంటూ.. సక్సెస్ గురించి ట్రావెల్ అవుతుంటారు. ఓ బెస్ట్ ఎంగ్జాపుల్ ర‌వికిషోర్‌గారు. ముప్పై ఏళ్లుగా ఆయ‌న సినిమాలు తీస్తూనే ఉన్నారు. స‌క్సెస్‌, ఫెయిల్యూర్ కామ‌న్‌. కానీ మ‌నం ముందుకెళుతుండాల‌ని ఆయ‌న చెప్పిన మాట‌లే నాకు ఇన్‌స్పిరేష‌న్‌.
ప్ర‌స‌న్న రెండు క‌థ‌ల‌ను చెప్పిన‌ప్పుడు `హ‌లోగురు ప్రేమ‌కోస‌మే` క‌థ విన‌గానే బాగా న‌చ్చింది. అయితే ఏదైనా కొత్త‌గా చేద్దామ‌నిపించి మ‌రో క‌థ‌ను సెల‌క్ట్ చేసుకున్నా. కానీ ప్ర‌కాశ్‌రాజ్‌గారు ఈ క‌థ విని నాకు ఫోన్ చేసి ఈ క‌థ‌తో సినిమా చేయ‌మ‌ని అన్నారు.  అలా నేను , రామ్‌, దేవిశ్రీ ప్ర‌సాద్‌, ప్ర‌కాశ్‌రాజ్‌గారు.. ఓ పాయింట్‌కి క‌నెక్ట్ అయ్యాం. ఇది హిలేరియ‌స్ మూవీ.. ఇందులో ఎంట‌ర్‌టైన‌రే కాదు.. సినిమాలో అద్భుత‌మైన పాయింట్ ఉంది. దాన్ని రేపు సినిమాలో చూస్తారు. ప్ర‌సన్న‌, త్రినాథ్‌, పాయికృష్ణ‌కు మంచి వేవ్ లెంగ్త్ కుదిరింది.. రెండు గంట‌ల ప‌దిహేను నిమిషాల క‌థ‌లో గంట ప‌ది నిమిషాలు.. థియేట‌ర్‌లో ప్రేక్ష‌కులు న‌వ్వుతూనే ఉంటారు. దేవిశ్రీ ప్ర‌సాద్ తో ఇది నా 9 సినిమా. ఈ సినిమాలోని ఐదు పాట‌లు.. ప్ర‌తి పాట‌ను ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తారు. త‌ను వ‌న్ ఆఫ్ ది బెస్ట్ పెర్‌ఫార్మ‌ర్‌. నేను శైల‌జ త‌ర్వాత రామ్ సెటిల్డ్ పెర్ఫామెన్స్‌తో న‌వ ర‌సాల‌ను ప‌లికించాడు. రామ్‌, ప్ర‌కాశ్‌రాజ్‌గారు... అనుప‌మ మూడు పిల్ల‌ర్స్‌. ప్ర‌కాశ్‌రాజ్‌గారిది కామెడీతో పాటు మంచి ఎమోష‌న‌ల్ పార్ట్ కూడా చూడొచ్చు. అనుప‌మ శ‌త‌మానం భ‌వ‌తి త‌ర్వాత త‌న‌కు చాలా మంచి పేరు వ‌స్తుంది. తెలుగు నెటివిటీ ఉన్న మ‌ధ్య త‌ర‌గ‌తి అమ్మాయిగా న‌టించింది. విజ‌య్ చ‌క్ర‌వ‌ర్తి విజువ‌ల్ ట్రీట్ ఇచ్చాడు. అంద‌రూ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు చేసిన సినిమా అంద‌రినీ మెప్పిస్తుంది
అన్నారు.

డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు న‌క్కిన మాట్లాడుతూ - ఈ సినిమాలో రామ్‌గారు డేడికేష‌న్‌తో ఈ సినిమాకి వ‌ర్క్ చేశారు. 104 ఫీవ‌ర్‌లో కూడా రామ్ అద్భుతంగా డాన్స్ చేశాడు. రామ్‌, ప్రకాశ్‌రాజ్‌గారిని పాట పాడ‌మ‌ని అడ‌గ్గానే వాళ్లు వెంట‌నే ఓకే చేశారు. వాళ్లు ఎలా పాడుతారోన‌ని అనుకుని భ‌య‌ప‌డ్డాం. కానీ చాలా చ‌క్క‌గా పాడారు. అక్టోబ‌ర్ 18న సినిమా విడుద‌ల‌వుతుంది అన్నారు.

హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మాట్లాడుతూ - ఇది తెలుగులో నా 7వ చిత్రం. మ‌ర‌చిపోలేని జ‌ర్నీ. దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లో శ‌త‌మానం భ‌వ‌తి త‌ర్వాత చేసిన చిత్ర‌మిది. ఆ సినిమాకు ఎంత మంచి పేరు వ‌చ్చిందో ఈ సినిమాకు కూడా అంతే మంచి పేరు వ‌స్తుంద‌ని అనుకుంటున్నాను. దిల్‌రాజుగారికి, ల‌క్ష్మ‌ణ్‌, శిరీష్‌గారికి థాంక్స్‌. త్రినాథ‌రావు న‌క్కిన‌గారు సెట్స్‌లో ఎప్పుడూ ఆట‌ప‌ట్టిస్తుండేవారు. అలాగే ప్ర‌స‌న్న‌గారు చాలా మంచి స‌పోర్ట్ అందించారు. ప్ర‌కాశ్‌రాజ్‌గారి గురించి చెప్పాలంటే శ‌త‌మానం భ‌వ‌తి  చిత్రంలో ఆయ‌న మ‌న‌వ‌రాలి పాత్ర‌లో న‌టించాను. ఈ చిత్రంలో కూతురి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాను. నాకు ఎప్పుడూ మంచి స‌ల‌హాలిస్తుండేవారు. రామ్‌తో కూడా ఇది రెండో చిత్రం. ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ త‌ర్వాత ఆయ‌న‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం రావ‌డం ఆనందంగా ఉంది. దేవిశ్రీ ప్ర‌సాద్‌గారితో కూడా ఉన్న‌ది ఒక‌టే జింద‌గీకి ప‌నిచేశాను. ఇది నా రెండో చిత్రం. మంచి సంగీతాన్ని అందించారు. సినిమా చాలా పెద్ద హిట్ కావాలి అన్నారు.
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ - సినిమా పాట‌ల‌ను హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. ఆడియో ట్రైల‌ర్ మాత్ర‌మే.. అస‌లు సినిమా అక్టోబ‌ర్ 18న సంద‌డి చేస్తుంది. రామ్ వ‌న్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫామెన్స్‌. త‌ను రాకింగ్‌. చాలా చ‌క్క‌గా న‌టించాడు. త‌న న‌ట‌న‌, డాన్సులను ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తారు. విజ‌య్ చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫీతో ప్ర‌తి ఫ్రేమ్‌ను ఫెంటాస్టిక్‌గా మ‌లిచారు. అనుప‌మ తెలుగులో చ‌క్క‌డా డ‌బ్బింగ్ చెప్పారు. రామ్‌, అను .. పెర్‌ఫార్మెన్స్ ఫెంటాస్టిక్‌గా ఉంటాయి. త్రినాథరావు న‌క్కిన కేవ‌లం కామెడీతో పాటు ఈ సినిమా అద్భుతంగా ఎమోష‌న్స్‌ను తెర‌కెక్కించారు. దిల్‌రాజుగారి సినిమా అంటే సెన్సార్ చేయ‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ప్రొడ‌క్ష‌న్స్ నుండి ఓ సినిమా వ‌స్తుందంటే క‌ళ్లు మూసుకుని న‌మ్మ‌కంతో థియేట‌ర్‌కు వెళ్లి సినిమా చూడొచ్చు. ఈ సినిమాతో పాటు రాజుగారి బ్యాన‌ర్‌లో ఎఫ్‌2 ... మ‌హ‌ర్షి సినిమాల‌ చేస్తున్నాను. శ్రీమ‌ణి చాలా చ‌క్క‌గా పాట‌లు రాశారు. అలాగే బోస్‌గారికి థాంక్స్‌. ప్ర‌స‌న్న‌గారు మంచి డైలాగ్స్ అందించారు. అంద‌రూ ప్రేమ‌తో సినిమాను చూసి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ చేస్తార‌ని భావిస్తున్నాం అన్నారు.

ప్ర‌స‌న్న‌కుమార్ మాట్లాడుతూ ఈ క‌థ రాశాక రాజుగారికి రామ్ అయితే బావుంటుంద‌ని చెప్పాను. రామ్ క‌థ‌ను ఎలాంటి ఎక్స్ ప్రెష‌న్ లేకుండా విన్నారు. కానీ డైలాగ్ వ‌ర్ష‌న్ విని చాలా న‌వ్వారు. ఆయ‌న చేసిన సంజు పాత్ర‌తో ప్రేమ‌లో ప‌డిపోయాను. ద‌స‌రాకి అంద‌రం క‌లిసి న‌వ్వుకుందాం. త్రినాథ్‌తో చాలా మంచి కెమిస్ట్రీ కుదిరింది నాకు అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో సాయికృష్ణ స‌హా మిగ‌తా యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%