Reason beyond Nikhil’s Tweet on Deverakonda

అందుకే విజయ్ పై నిఖిల్ ట్వీట్ !

Reason beyond Nikhil's Tweet on Deverakonda

యువ హీరో నిఖిల్ ప్రస్తుతం ముద్ర అనే చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించే ట్విటర్ లో పెట్టిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది "ఈ ప్రపంచం తమ చుట్టూ తిరుగుతుందని భావిస్తోన్న వారిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేస్తున్నాను. వాళ్లు అనవసరమైన యాటిట్యూడ్ ను ప్రదర్శిస్తూ వుంటారు. కానీ నువ్వు అంత ముఖ్యమైనవాడివి కాదు. ప్రతి నటుడు తనతో తాను పోటీపడాలి.సినిమా నిర్మాణమనే మహా సముద్రంలో మనం నీటి బొట్ల వంటి వాళ్లం. ఇక్కడ హైప్ తక్కువ ప్రదర్శించాలి .. పని ఎక్కువ చేయాలి"అనేది నిఖిల్ పెట్టిన ట్వీట్ సారాంశం.

ఈ ట్వీట్ చేసిన ప్రతి వొక్కరికి అర్థం అవుతోంది. ఇది విజయ్ దేవరకొండను ఉద్దేశించి పెట్టడాని. నిఖిల్ ఈ ట్వీట్ ను పెట్టక కొందరు నిఖిల్ ను సపోర్ట్ చేస్తే మరికొందరు విమర్శించారు. అభిమానులు, సినిమా జనాలు ఈ ట్వీట్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం చూసి నిఖిల్ ఈ ట్వీట్ ను పెట్టిన కొద్దిసేపటికే డెలీట్ చేశాడు. విజయ్ దేవరకొండ పబ్లిక్ ఫంక్షన్స్ లో ఓవర్ గా మాట్లాడడం, నోటా సినిమా ఫ్లాప్ అవ్వడంతో కొందరు నా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారని చెప్పడంతో నిఖిల్ ఈ ట్వీట్ పెట్టినట్లు సమాచారం.

Facebook Comments
Share
%%footer%%