నితిన్ డిమాండ్ కు నిర్మాతల రియాక్షన్ !
అఆ సినిమా తరువాత నితిన్ లై సినిమాను 14 రీల్స్ బ్యానర్ లో చేశాడు. లై సినిమాకు 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం జరిగింది. ఆ సినిమా దిల్ రాజు బ్యానర్ లో శ్రీనివాస కళ్యాణం సినిమాను చేశాడు. శ్రీనివాస కళ్యాణం సినిమాకు నితిన్ 5 కోట్లు తీసుకోవడం జరిగింది. సినిమా పెద్ద ఫ్లాప్. ఇప్పుడు నితిన్ తరువాత చేయబోయే సినిమాకు మార్కెట్ పెద్దగా ఉండదు కావున నితిన్ కు 5 కోట్లు ఏ నిర్మాత ఇవ్వడు.
కానీ నితిన్ తన నెక్స్ట్ సినిమాను డైరెక్టర్ వెంకీ కుడుములతో చెయ్యడానికి ఒప్పుకున్నాడు. సితార ఎంటర్తైంమెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. సితార బ్యానర్ నితిన్ కు 5 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. నితిన్ మాత్రం తనకు 5 కోట్లు కావాల్సిందేనని కూర్చున్నాడు కావున సినిమా ఆలస్యం అవుతోంది. భీష్మ పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ నెలాఖరుకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ పూర్తి అయితే వచ్చే నెల నుండి సినిమాను ప్రారంభించాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరి నితిన్ తన రెమ్మునరేషన్ తగ్గించుకొని సినిమా చేస్తాడా ? లేదా ? అనేది చూడాలి.