భారతదేశపు అతి పెద్ద ఫుడ్ ట్రక్...‘‘కిచెన్ ఆన్ 16వీల్స్’’ ఇప్పుడు హైదరాబాద్‌లో...
హైదరాబాద్, 07, 2018: మొబైల్ ఫుడ్ వ్యాపారంలో సంచలనానికి శ్రీకారం చుట్టిన భారతదేశపు అదిపెద్ద ఫుడ్ ట్రక్ ఇప్పుడు హైదరాబాద్ నగరానికి వచ్చేసింది. నగరంలోని భోజనప్రియుల విభిన్న రకాల ఆహారపు అవసరాలను, అభిరుచులను తీర్చడానికి, అవసరమైన అన్ని హంగులతో, అత్యంత రుచికరమైన వంటకాలను ఈ ఫుడ్ ట్రక్ అందిస్తోంది. ఈ అతిపెద్ద లెజండరీ ఫుడ్ ట్రక్‌ను అరవింద్ అలిశెట్టి, సాహితి వర్ధన్, దినేష్ కుమార్‌లు నిర్వహిస్తున్నారు. చెఫ్ చ్యూస్, వాఫెల్ హౌజ్, డౌన్‌టౌన్ ఎట్ 16, ఫ్రైస్ అండ్ కోన్స్, గోదావరి రుచులు...దీనికి సహ వ్యాపార బ్రాండ్స్‌గా ఉన్నాయి.
విశేషాలెన్నో...
అత్యంత భారీగా రూపొందింది ఇది 50 అడుగుల ఫుడ్ ట్రక్ దీనికి 16 వీల్స్‌తో పాటుగా ఇందులో అరడజను ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. తద్వారా ఈ ‘కిచెన్ ఆన్ 16 వీల్స్’ ఫుడ్ ట్రక్... ఫుడ్ లవర్స్‌కి కావాల్సిన అన్ని రకాల రుచులనూ వడ్డిస్తుంది. వైవిధ్యభరితమైన వంటకాలతో కూడిన మెనూ దీని సోంతం. అత్యాధునికమైన, అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో తయారయ్యే వంటకాలు, వాటిని వండేందుకు గాను చేయి తిరిగిన చెఫ్స్ దీని ప్రత్యేకతలు.
గచ్చిబౌలిలో గొప్ప ప్రారంభం...
ఈ అతిపెద్ద రుచుల కిచెన్ ఆన్ 16 వీల్స్ వాహనాన్ని గచ్చిబౌలి స్టేడియం దగ్గర ఆదివారం సాయంత్రం 5.30గంటలకు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో నిఖిల్, రాజ్య సభ సభ్యులు కేశవరావు, ఆయన కుమారుడు విప్లవకుమార్ తదితరులు హాజరయ్యారు.