కాజల్ రేటు పెంచింది !
కాజల్ ప్రస్తుతం తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ తో రెండు సినిమాలు చేస్తోంది. శర్వానంద్ తో ఒక సినిమాలో నటిస్తోంది. సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ ను ఈ మధ్య ఇద్దరు నిర్మాతలు సినిమాలు చెయ్యమని అడిగారట కానీ కాజల్ అందుకు ఒప్పుకోలేదని సమాచారం. ఎందుకంటే... కాజల్ ఇప్పుడు సినిమాకు కొటి 75 లక్షలు అడుగుతొందని అంటున్నారు. మీడియం హీరోలతో తీసే ఈ సినిమాలకు కాజల్ కు అంత బజ్జెట్ ఇచ్చే సాహసం చెయ్యలేక వెనక్కి తగ్గారట ఆ నిర్మాతలు.
తెలుగులో దాదాపు అందరు టాప్ హీరోలతో నటించిన కాజల్ ఇప్పటికీ కోటి 75 లక్షలు అడగడం కొందరు దర్శక నిర్మాతలను కలవర పెడుతోంది. దర్శకుడు తేజ తనను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన కారణంగా తేజ, బెల్లంకొండ సినిమాకు కేవలం 50 లక్షలు తీసుకుంటుందని సమాచారం. ఇంకో విషయం ఏంటంటే తను అడిగిన రెమ్యునరేషన్ ఇస్తే ఏ హీరోతోనైన ఆమె సినిమా చెయ్యడానికి సిద్ధంగా ఉందని ఇండస్ట్రీ టాక్.
This website uses cookies.