మహేశ్ బాబు తరహాలో విజయ్ దేవరకొండ !
నోటా సినిమా సక్సెస్ సాధిస్తే తమిళ్ లో విజయ్ దేవరకొండకు మంచి మార్కెట్ వస్తోంది. ఇకపై తను చేయబోయే అన్నీ సినిమాలు తమిళ్ లో డబ్ చేసి విడుదల చేయొచ్చు అనే ఆలోచన విజయ్ కు ఉండేది. కానీ నోటా సినిమా ఫ్లాప్ టాక్ రావడంతో విజయ్ దేవరకొండ ఆశలపై నీరు చల్లినట్లు అయ్యింది. ఇంకో రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్స్ పడితే విజయ్ దేవరకొండ పరిస్థితి సాయి ధరమ్ తేజ్ లా తయారు అవుతోంది. మహేశ్ బాబు ఇన్ని సినిమాల్లో నటించిన తరువాత స్పైడర్ సినిమాతో తమిళ్ లో మంచి మార్కెట్ సాధిద్దాం అనుకున్నారు. కానీ స్పైడర్ ఫ్లాప్ తరువాత తెలుగులోనే సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.
నోటా సినిమా విషయానికి వస్తే.. సినిమాలో అస్సలు దమ్ము లేదు. పాత కథ, కథనాలు ఉండడంతో సినిమాను తిప్పికొట్టారు జనాలు. తెలుగు హీరోలు తమిళ్ లో సక్సెస్ అయిన సంధార్భాలు చాలా తక్కువ. ఇప్పుడు విజయ్ దేవరకొండ నోటా దెబ్బకి తెలుగులో తప్పా వేరే భాషలో ట్రై చేసే ఛాన్స్ లేదు. ప్రస్తుతం విజయ్ నూతన దర్శకుడు భరత్తో డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడు. రస్మిక ఈ సినిమాలో హీరోయిన్.
This website uses cookies.