ప్రేమ గెలుస్తుందా..స్నేహం నిలుస్తుందా?
నయన్ షా ఫిలిమ్స్ పతాకంపై.. ఎల్.వి.రాజ్ శేఖర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ..లోలుగు సుజయ్ నాయుడు సమర్పణలో గుండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి నిర్మించిన ముక్కోణపు ప్రేమ కథా చిత్రం "ఫ్రెండ్ షిప్ వెర్సస్ లవ్"
సూర్య, మనీష్, స్నేహ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ఎఫ్.ఎం.బాబాయ్, జబర్దస్త్ అప్పారావు, శిరీష, శ్రీకర్ నీరోష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.ఘంటసాల విశ్వనాధ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం ఈనెల 5 న విడుదల కానుంది.
సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఈనెల 5 న విడుదల చేస్తున్నామని నిర్మాత గుండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రాణ స్నేహితులు ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలేంటి? స్నేహానికి సవాలుగా నిలిచిన ప్రేమలో ఎవరు విజయం సాధిస్తారు? ప్రేమ గెలుస్తుందా? స్నేహం నిలుస్తుందా? అనే నేపథ్యంలో రూపొందిన 'ఫ్రెండ్ షిప్ వెర్సస్ లవ్' కచ్చితంగా యువతరం ప్రేక్షకులతోపాటు అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నాం" అని దర్శకులు ఎల్.వి రాజ శేఖర్ అన్నారు. ఈయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే. సంభాషణలు కూడా సమకూర్చారు!!