Social News XYZ     

Maro Adugu Marpu Kosam movie teaser launched

మరో అడుగు మార్పుకోసం ఫస్ట్ లుక్ అండ్ టీజర్ లాంఛ్

Maro Adugu Marpu Kosam movie teaser launched

సమాజిక బాధ్యతను గుర్తు చేసే సినిమాలు అరుదుగా వస్తాయి. అంటువంటి అరుదైన చిత్రమే ‘మరో అడుగు మార్పుకోసం’. స్వతంత్రభారతంలో రిజర్వేషన్స్  ప్రక్రియ అమలులోకి వచ్చినప్పడి నుండి ఇప్పటి వరకూ చాలా చర్చలు వాటిపై జరిగాయి.  కుల నిర్మూలన జరగాలి అనే ప్రతి పాదనలు చర్చలవరకే పరిమితం అయ్యాయి. అటువంటి సమస్యకు పరిష్కారం చూపించే సినిమా ‘ మరో అడుగు మార్పుకోసం’. నటుడిగా సుదీర్ఘ ప్రయాణం చేసిన ప్రసన్నకుమారు ఈ

 

చిత్రానికి స్వీయ దర్శకత్వం వహించడం తో పాటు  ముఖ్య మంత్రి  పాత్ర ను పోషించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ లాంఛ్ ప్రముఖ క్రికేటర్ వెంకటిపతి రాజు చేతులు మీదుగా జరిగింది.   ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ నృత్య దర్శకులు శ్రీ శివసుబ్రమణ్యం రాజు దంపతులకు  ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చేతులు మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు నిర్మాత, హీరో ప్రసన్నకుమార్. మీడియా ముందు ప్రసన్నకుమార్ సింగిల్ టేక్ లో చెప్పిన లెంగ్తీ డైలాగ్ ఆకట్టుకుంది. రిజర్వేషన్ప్ మీద, కులాల మీద వీటి క్రింద పడినలుగుతున్న భావితరాల భవిష్యత్ మీద ఆలోచన, ఆవేదన మేళవించిన కంఠం తో ప్రసన్నకుమార్ చెప్పిన డైలాగ్ కి హాజరైన ప్రముఖులంతా కరతాళ ధ్వనులతో అభినందించారు.

ఈ కార్యక్రమంకు హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ:
వెంకటపతి రాజు మాట్లాడుతూ: ప్రసన్నకుమార్ నాకు చిన్నతనం నుండి మిత్రుడు వైజాగ్ లో తరుచుతూ అతని జిమ్ కే వెళుతుండే వాళ్లం. ఈ సినిమా కాన్సెప్ట్ విన్నాక నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇలాంటి కాన్సెప్ట్ తో బోల్డ్ అటెంప్ట్ చేసినందుకు ప్రసన్నకుమార్ ని అబినందిస్తున్నాను. తప్పక విజయం సాధించాలని కోరకుంటున్నాను.

హీరో ప్రసన్నకుమార్ మాట్లాడుతూ:
సినిమా మీద ప్యాషన్ తో సినిమా రంగంలో కొనసాగుతున్నాను.  అదే బాధ్యతతో ఈ సినిమాను నిర్మించాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సినిమా ని పూర్తి చేసాను. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. త్వరలో విడులకు సిద్దం అవుతుంది అన్నారు.

చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ:
సినిమాను నమ్ముకుంటే తప్పకుండా సినిమా గొప్ప వాళ్ళను చేస్తుంది. ప్రసన్నకుమార్ కష్టం నాకు తెలుసు. నటుడిగా హాయిగా ఉన్నటైం లో నిర్మాతగా మారి మంచి సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలనే అతని ప్రయత్నం తప్పకుండా విజయం సాధిస్తుంది. మా బ్యానర్ నుండి వచ్చిన ‘ బిచ్చగాడు’ తరహాలో విజయం సాదించాలని కోరకుకుంటున్నాను.

దర్శకుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ:
సినిమా తీయడం అనేది ఎంత కష్టం తో కూడుకున్నదో తెలుసు. కమర్షియల్ సినిమలకు అభ్యంతరాలు చెప్పని సెన్సార్ బోర్డ్ ఈ సినిమా విషయంలో అభ్యంతరాలు చెప్పారని తెలుస్తుంది. సమాజంలో మార్పుకు దోహద పడే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి

అఖిల్ కార్తిక్ మాట్లాడుతూ:
నేను వైజాగ్ ఉన్పప్పటినుండి ప్రసన్నకుమార్ గారు తెలుసు. నన్ను ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేసారు. సత్యానంద్ ఇనిస్టిట్యూట్ లో నేను శిక్షణ తీసుకుంటున్న టైం లో ప్రసన్నగారిని కలిసినప్పుడు నాకు తప్పకుండా అవకాశం ఇప్పిస్తానన్నారు. ఈ సినిమాలో బాగం అవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

మితా విజన్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాకు కథ, మాటలు, స్ర్కీన్ ప్లే , దర్శకుడు, నిర్మాత : ప్రసన్నకుమార్ ఐనవోలు మిగిలిన ముఖ్య పాత్రలలో  అఖిల్ కార్తిక్
ఎఫ్ ఎమ్ బాబాయి, ఎర్రం నాయుడు , థమన్ కుమార్, నారాయణ రావు, మంత్రి మూర్తి, యస్ పవిత్ర, రాజావర్మ తదితరులు నటించారు

Facebook Comments
Maro Adugu Marpu Kosam movie teaser launched

About uma